Tuesday, 30 October 2012
Saturday, 27 October 2012
ఉత్తమ టపా - 27th Oct, 2012
ఉత్తమ టపా :-
మంచిమాట: - సత్యం మహోన్నత మానవుడి లక్ష్యం.
పెయింటింగ్స్ లో, కవితలలో తనదైన ప్రతిభ చూపిస్తూ ఒక సారి చదివిన ఏ బ్లాగర్ కై ఖచ్చితంగా బ్లాగ్ మొత్తం చదివి తీరాలి అనిపించేలా అందంగా తీర్చిదిద్దబడిన ముచటైన బ్లాగ్ "పద్మార్పిత".
ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా పద్మార్పిత గారు రచించిన "నా వయసెంత". స్త్రీ ఔన్నత్యాన్ని ఏంతో సున్నితంగా వివరించారు రచయిత్రి పద్మార్పిత గారు.
ఉత్తమ టపా లంకె - "నా వయసెంత".
పద్మార్పిత గారికి అభినందనలు.
తన బ్లాగ్ లో మెంబర్స్ వంద మందికి చేరినందుకు బ్లాగ్ముఖంగా అభినందనలు బ్లాగర్స్ అందరి తరపునా తెలియచేస్తున్నాను.
మంచిమాట: - సత్యం మహోన్నత మానవుడి లక్ష్యం.
- లాస్య రామకృష్ణ
Thursday, 25 October 2012
బ్లాగులోకంలో వంద బ్లాగులు చోటుచేసుకున్నాయోచ్.....
నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను.
ఆ ప్రయత్నంలో భాగంగా బ్లాగ్లోకంలోకి వంద బ్లాగులు చోటు చేసుకున్నాయి. ఇంకా మరిన్ని మంచి బ్లాగులు బ్లాగులోకం లోకి అడుగిడబోతున్నాయి.
ఈ సందర్భంగా నాకు మెయిల్ ద్వారా మంచి బ్లాగుల గురించి తెలియచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
- లాస్య రామకృష్ణ
Tuesday, 23 October 2012
బ్లాగ్ లో ని టపాలను పిడియఫ్ (PDF) రూపంలో Convert చేసుకోవాలనుకునేవాళ్ళకి శుభవార్త.
నాకు తెలిసిన విషయాన్ని నా లాంటి బ్లాగర్స్ కి ఉపయోగపడుతుందని పంచుకుంటున్నాను.
బ్లాగు లోకం ఎంత పెద్దది. ఎంత విశాలమైనది.
ఎందరో బ్లాగర్స్. పత్రికలో రాసే రచయితలకంటే గొప్ప టాలెంట్ ఉన్న బ్లాగర్స్ సరైన అవకాశం లేక బ్లాగ్ లోనే పోస్ట్ చేసుకుంటున్నారు
ఎన్నో టపాలను రాస్తాం. అయితే వాటిని అంతర్జాలం సహకరిస్తేనే మనం చూసుకోగలుగుతాం. మరి టపాలని PDF రూపంలో మార్చుకోగలిగితే.
బ్లాగ్ లో ని టపాలను పిడియఫ్ (PDF) రూపంలో Convert చేసుకోవాలనుకునేవాళ్ళకి శుభవార్త.
వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. నచ్చినప్పుడల్లా చదువుకోవచ్చు, అంతర్జాలం ఉపయోగించడం తెలియని వాళ్లకి కూడా చదవడానికి ఇవ్వవచ్చు.
ఈ మధ్యనే నాకీ విషయం తెలిసి చాలా సంతోషించాను.
వివరాలకు, blogspdf@gmail.com కి మెయిల్ చెయ్యండి.
సేకరణ
లాస్య రామకృష్ణ
Saturday, 20 October 2012
నవరాత్రి బ్లాగోత్సవాలలో అయిదవ రోజు
నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం సుస్వాగతం
నవరాత్రి బ్లాగోత్సవాల సందర్భంగా బ్లాగ్ లోకంలో ఈ రోజు చోటు చేసుకున్న బ్లాగ్ గురించి తెలుసుకుందాం.
కుట్లు అల్లికలు, రక రకాల రంగవల్లులతో మనందరికీ స్వాగతం పలుకుతోంది "సఖియా వివరించవే' బ్లాగ్.
చాలా సులభమైన చిట్కాలతో కుట్లు అల్లికల గురించి వివరించారు బ్లాగర్ "అనామిక" గారు.
మరి నేర్చేసుకుందామా!!!
- లాస్య రామకృష్ణ
Friday, 19 October 2012
నవరాత్రి బ్లాగోత్సవాలలో నాలుగవ రోజు
నమస్కారం,
నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం, సుస్వాగతం.
నవరాత్రి బ్లాగోత్సవాలలో చోటు చేసుకున్న బ్లాగ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా!!!
చదివేయండి మరి.
చక్కని కవితలతో మనసు సేదతీరాలంటే ఖచ్చితంగా ఈ బ్లాగ్ ని వీక్షించాలి.
బ్లాగ్ లంకె - లిఖిత
- లాస్య రామకృష్ణ
Thursday, 18 October 2012
నవరాత్రి బ్లాగోత్సవాలలో మూడవ రోజు
నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం సుస్వాగతం...
మనం ప్రతి రోజు ఒక బ్లాగ్ గురించి నవరాత్రుల సందర్భంగా మాట్లాడుకుంటున్నాం.
ఇవాల్టి బ్లాగ్ గురించి తెలుసుకుందామా మరి!
కాలక్షేపం కోసం ఏదైనా కథ చదవాలనుకుంటున్నారా? అయితే మీ నిరీక్షణ ఫలించినట్టే.
చక్కటి కథలు, కవితలు ఇంకా ఎన్నో కబుర్లు, మనందరి కోసం తన బ్లాగ్ లో భద్రపరచిన బ్లాగర్ గారు ప్రముఖ రచయిత బి వి డి ప్రసాదరావుగారు.
బ్లాగ్ లంకె - బి వి డి ప్రసాద రావు - నా కబుర్లు నా రచనలు.
బ్లాగ్ ఓపెన్ చెయ్యగానే ఎన్నో కథలు, కవితలు మనకి స్వాగతం పలుకుతాయి.
సో ఇంకెందుకాలస్యం, చదివేయండి మరి.
- లాస్య రామకృష్ణ
Wednesday, 17 October 2012
నవరాత్రి బ్లాగోత్సవాలలో రెండవ రోజు .....
నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం సుస్వాగతం.
నవ్వు నాలుగు విధాల చేటు అన్నది ఒకప్పటి మాట. నవ్వు నాలుగు విధాలా గ్రేటు అన్నది శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం.
మెకానికల్ గా రోజు ప్రారంభించడం అలవాటైపోయిన ఈ ఆధునిక జీవన విధానంలో నవ్వటమే మనిషి మరచిపోతున్నాడు.
మరి మంచి హాస్యపూరితమైన బ్లాగ్ చదివి కాసేపు హాయిగా నవ్వుకుందామా??
నవరాత్రి బ్లాగోత్సవాలలో ఇవాళ చోటు చేసుకున్న బ్లాగ్ పేరు "నవ్వులాట".
మీ చిరునవ్వుల కోసం ఈ బ్లాగ్ అంకితం అని నవ్వులాట అనే బ్లాగు ద్వారా మనందరికీ నవ్వులు పంచుతున్న బ్లాగర్ "నవ్వులాట శ్రీకాంత్ గారు".
ఇంకెందుకాలస్యం చదివేయండి మరి......
- లాస్య రామకృష్ణ
గమనిక :- మీకు తెలిసిన మంచి బ్లాగ్ ని'బ్లాగ్ లోకం'
లో పరిచయం చేయగోరు వారు దయచేసి lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యగలరు.
Tuesday, 16 October 2012
నవరాత్రి బ్లాగుల ఉత్సవాలు
బ్లాగర్లకు, బ్లాగు వీక్షకులకు నా మనఃపూర్వక నమస్కారములు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేను ఈ పండగ రోజుల్లో మీకు ప్రతి రోజు ఒక బ్లాగుని పరిచయం చేయబోతున్నాను.
నవరాత్రి బ్లాగుల ఉత్సవాలలో చోటు చేసుకున్న బ్లాగ్ 'చేయూత'.
'ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అన్న సూక్తి ని నమ్ముకుని సహాయం కోసం అలమటిస్తున్న వారిని ఏంతో మందిని ఈ బ్లాగ్ ద్వారా మనకి తెలియచేస్తున్నారు చేయుత బ్లాగ్ నిర్వాహకులు ఉండవల్లి శ్రీనివాసరావుగారు మరియు బాపు గారు. బ్రతుకు, బ్రతకనివ్వు అన్నట్టుగా సహాయం కోసం ఎదురుచుసేవారికి, సహాయం చెయ్యాలనుకునే వారికి వారధిగా నిలుస్తున్నారు.
లంకె - 'చేయూత'
Monday, 15 October 2012
చదరంగం
చదరంగం ఆటలో కిక్కు నాకిన్నాళ్ళు అర్ధం కాలేదు. ఒక సారి నేర్చుకున్నాక ఇక చదరంగం అట అపాలనిపించదు

ఈ
మధ్యనే నేని గేమ్ నేర్చుకున్నాను. సో ఈ అట బ్యాక్ గ్రౌండ్ గురించి
తెలుసుకొవాలనిపించిది. అఫ్ కోర్సు, చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదరంగం
గురించి ఒక లెస్సన్ ఉండేది. కానీ అప్పుడంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ ఒక
సారి గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక ఇది ఒక వ్యసనం ల మనల్ని వెంటాడుతుంది
(నన్ను). అంటే అంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందన్న మాట ఈ ఆట.
కాబట్టి సరదాగా ఈ ఆట గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
చదరంగానికి
1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశం లో నే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర
చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి
వ్యాప్తించింది. పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ
ఆటని తీసుకెళ్ళారు. వర్తమాన కాలంలో వాడుకలో ఉన్న చదరంగం ఆట పరిణామక్రమంలో
యూరోప్ లోని 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.
లాస్య రామకృష్ణ
Saturday, 13 October 2012
ఉత్తమ టపా -13th Oct 2012
ఉత్తమ టపా :- ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా 'మీరంతా ఆహ్వానితులే '.
లంకె - 'మీరంతా ఆహ్వానితులే '
ఈ టపా కిరణ్ గారు నిర్వహిస్తున్న 'వెన్నెల' అనే బ్లాగు నుండి ఎన్నుకోబడినది.
అమ్మ వంట రుచికి అలవాటు పడినవారు, అమ్మ అనుకోకుండా ఉరు వెళ్ళినప్పుడు వంట చేయాల్సి వచ్చినప్పుడు వంట చెయ్యడానికి తను పడిన పాట్లు, తిన్న తర్వాత కుటుంబ సభ్యుల అవస్తల గురించి రచయిత్రి కిరణ్ గారు ఎంతో హాస్యభరితంగా వివరించారు.
ఈ టపా చదివి మనసారా నవ్వుకోవచ్చు.
కిరణ్ గారికి అభినందనలు.
మంచి మాట:- బలమే జీవనం. బలహీనతే మరణం.
- లాస్య రామకృష్ణ
Tuesday, 9 October 2012
Saturday, 6 October 2012
ఉత్తమ టపా -6th Oct 2012
తన అక్షరాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్న మోపూరు పెంచల నరసింహం గారి 'వెలుగు పూలు' బ్లాగ్ లోనుండి 'అందాల జాతర' ఈ వారం ఉత్తమ టపా. మోపూరు పెంచల నరసింహం గారికి అభినందనలు. పెంచల నరసింహం గారి ఆత్మ విశ్వాసానికి జోహార్లు.
"వెలుగుపూలు " పేరుతో.. తన ఆత్మ విశ్వాసాన్ని అక్షరాలుగా వెదజల్లే.. ఈ
బ్లాగ్ ని చూడండి..మనకి మరో లూయిస్ బ్రెయిలీ,హెలెన్ కెల్లర్, కాంప్బెల్
గుర్తుకురావడం లేదు..! అని మనకొక మంచి బ్లాగ్ ని పరిచయం చేసిన వనజ వనమాలిగారికి ధన్యవాదములు.
ఉత్తమ టపా లంకె - అందాల జాతర
మంచి మాట :- మెరుగుపెట్టని వజ్రం ప్రకాశించదు. కష్టాలను ఎదుర్కోని మనిషి రాణించడు.
- లాస్య రామకృష్ణ
Monday, 1 October 2012
బ్లాగు 'సిత్రాలు'
ప్రపంచంలో ప్రతి అరక్షణంకి ఒక కొత్త బ్లాగ్ సృష్టించబడుతోంది.
అత్యదిక మంది రోజులో కనీసం ఒక సారైనా ఏదైనా బ్లాగ్ ను చదువుతుంటారు
ఉదయం పుట బ్లాగ్స్ ని చదివే నిష్పత్తి ఎక్కువ.
ఉదయం = 79%
సాయంత్రం = 51%
రాత్రి = 40%
బ్లాగ్ రీడింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభం అయితే ఉదయం పది గంటలకి ఎక్కువ స్థాయికి చేరుతుంది.
బ్లాగ్ షేరింగ్ అత్యధికంగా జరిగే సమయం ఉదయం 7 గంటలకు.
బ్లాగ్ కామెంట్స్ అత్యధికంగా జరిగే సమయం ఉదయం 8 గంటలకు.
బ్లాగ్స్ మార్కెట్ ని కూడా ప్రభావిత పరుస్తున్నాయి. 21% కొనే వస్తువుపై నిర్ణయం, 19% ఛాయస్ కోసం, 19% అ వస్తువుపై విశ్లేషణ, 17% కావాల్సిన వస్తువుని వెతకడం కోసం, 13% కొనాలని గట్టిగా తీర్మానిన్చుకోవడానికి సహాయపడుతున్నాయి.
- లాస్య రామకృష్ణ
Subscribe to:
Posts (Atom)
రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...

-
పేరు: - "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాక...
-
నమస్కారం, నా బ్లాగ్ కి స్వాగతం.
-
నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను. ఆ ప్రయత్నంలో భాగంగా ...