Posts

Showing posts from April, 2013

లాస్య రామకృష్ణ తో కష్టేఫలే గారి ఇంటర్వ్యూ

Image
పేరు:- "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాకు ఒక పేరు కాదమ్మాయ్! రెండు పేర్లు. పెద్ద కధే ఉంది మరి, చెప్పమన్నావా?  ఒక పేరు కన్నమ్మ పెట్టింది, పెంచుకున్నమ్మ పొద్దుచూసేది, చూడలేక నాకు ’భాస్కరశర్మ’ అని పేరు కన్నమ్మ చేత  పెట్టించి, తనుపొద్దు చూడటం మానేసిందిట. అలా మొదటిపేరు కన్నమ్మ పెట్టినా అది పెంచుకున్నమ్మ ఆలోచనే. ఆ తరవాత పద్నాలుగో సంవత్సరం లో పెంచుకున్నమ్మ పుట్టినప్పుడు తను పెట్టించిన పేరు మార్చేసి ’వేంకట దీక్షితులు’ అని మళ్ళీ నామ కరణం చేసింది. రెండు పేర్లూ చెప్పుకుంటాను. అప్పటికే బడిలో పుట్టినప్పటి పేరు రాసేయడం తో ఆ రోజులలో మార్పులు చేసేసావకాశం లేక మొదటి పేరుతో మిగిలిపోయా.

మీ ఊరు:- ప్రస్తుతం తూ.గో.జి లో అనపర్తి. రాజమంద్రికి ముఫ్ఫయి కి.మి. దూరం. చెన్నై-కలకత్తా మెయిన్ లైన్ మీద ఉన్నది,

స్వస్థలం;-నావన్నీ రెండేనమ్మా! పొరపాటు పడకేం ఇల్లాలు మాత్రం ఒకత్తే. :)
పుట్టింది గూటాల, ప.గో.జిలో పోలవరం దగ్గర పల్లెటూరు. పెరిగింది, మరో పల్లెటూరు, తూ.గో.జిలో దుళ్ళ, రాజమంద్రికి పదిహేనుకిలోమీటర్లు దూరం. మొత్తానికి గో.జి.లు నా పు…

లాస్య రామకృష్ణ తో మంజు గారి మదిలో మాట

Image
మంజు గారు బ్లాగు మిత్రుల కోసం పంచుకున్న కొన్ని వివరాలు వారి మాటల్లోనే 


"పేరు మంజు యనమదల అండి పుట్టింది కృష్ణా జిల్లా దివి తాలుకా లోని జయపురం లొ జనవరి ఇరవై ఒకటిన . సొంత ఊరు నరసింహాపురం... ఇక ఇష్టమైన అలవాట్లు అంటారా చాలా ఉన్నాయి ...పుస్తకాలు, పాటలు వినడం, వంట చేయడం, ఇదిగో ఇలా కవితలు రాయడం.... ఇంకా చాలా ఉన్నాయిలెండి. 
 నచ్చిన రచయిత అంటే చాలా మంది వున్నారు యండమూరి, మాదిరెడ్డి, కొమ్మునాపల్లి, సూర్యదేవర, మధుబాబు, విజయలక్ష్మి మురళీధర్, చిట్టా సూర్య కుమారి, నిషిగంధ, కిరణ్ ప్రభ.... ఇలా లిస్టు పెద్దదే అండి... నచ్చిన రంగు నలుపు లేత పసుపు, నచ్చిన సినిమా ఒకటంటే కష్టం చాలా ఉన్నాయి నిరీక్షణ, అంకురం ఇలా వైవిధ్య భరితమైన కధలతో వచ్చే ప్రతి సినిమా ఇష్టమే. తిండి అంటారా ఏదైనా పర్లేదు కాకరకాయ వేపుడు ఇష్టం బాగా. నచ్చే ప్రదేశం అంటే ఆకాశం సముద్రం కలిసినట్లుండే చోటు...కన్యాకుమారి బాగా ఇష్టం ఇంకా చూడలేదు కాని ఎప్పటికైనా చూడాలి అన్నంత ఇష్టం.  జీవితం అంటే ఏం చెప్పను ఇంకా దాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం లోనే ఉన్నాను. ఇతరులలో నచ్చేవి అంటే ఏమో అందరు మంచివారే కాకపొతే పరిస్థితుల ప్రభావంతో మారిపోతూ ఉంటారు...ఎదుటి వారి…

త్వరలో "కష్టేఫలి" గారి ఇంటర్వ్యూ బ్లాగు లోకం లో

బ్లాగులోకం లో అతి త్వరలో 'కష్టేఫలి' గారి ఇంటర్వ్యూ 

- లాస్య రామకృష్ణ 

లాస్య రామకృష్ణ తో లక్ష్మీ రాఘవ గారి మదిలో మాట

Image
నా పేరు -డా. కే.వి లక్ష్మి 

కలం పేరు -లక్ష్మి రాఘవ 

బ్లాగు - బామ్మగారి మాట

మావూరు - కురబలకోట . చిత్తూరు జిల్లా ...పెరిగినది, చదువు , ఉద్యోగం అంతా  హైదరాబాదు లో ..రిటైర్మెంట్  తరువాత వెనక్కి మళ్ళి పల్లె జీవితం !

పుట్టిన తేదీ - 09-01-1948

హాబీస్ --మొదటగా ఒక ఆర్టిస్ట్ నాలో అనేక రకాలుగా వ్యక్తమై, వ్యర్తపదార్ధాలతొ అనేక ఆకృతులు చేసి కలకత్తా నగరంలో కూడా ఎక్ష్జిబిశన్ చేయటం ఒక మంచి అనుభూతి . ఈ నాటికి ఏది చూసినా చెయ్యాలనే ఉత్చాహం ..painting-watercolours,oil. pencil sketching , carving chalkpieces, blok printing on sarees ,fabric painting ...i have tried every possible art!

అభిమాన రచయిత- యుద్దనపూడి సులోచనారాణి .

నచ్చేరంగు -- మెరూన్.

నచ్చేసినిమా - ఎప్పటికీ మాయాబజార్ 

ఇష్టమైన ఆహారం -వెజిటేరియన్ 

ఇష్టమైన పుస్తకం - సెక్రెటరీ

ఇష్టమైన ప్రదేశం --మా వూరు

జీవితం అంటే --ఒక అవకాశం సద్వినియోగ పరచుకోవడానికి ..

ఇతరులలో నచ్చేవి -- నన్ను కించ పరచని వారు  

సాహిత్యం లో నా ప్రయాణం ---మొదటి కథ వచ్చింది 1966 లో ఆంధ్రపత్రికలో....మద్యలో చాలా గ్యాప్ తరువాత ఈమధ్య రెగ్యులర్గా రాయగలుగుతున్నాను 

నా  రోల్ మోడల్ - మా శ్రీ వారు డా. కామకోటి …

బ్లాగు లోకం తరపు నుండి మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Image
లాస్య రామకృష్ణ

పోటీ ఫలితాలు

బ్లాగ్ లోకం నిర్వహించిన ఉగాది కవితల పోటీకి వచ్చిన కవితలు అన్నీ వేటికవే ప్రత్యేకత కలిగినవి. కవితలు పంపించిన రచయిత(త్రి) ల కు అభినందనలు. 
ప్రముఖ రచయిత పి.వి.డి.యస్ ప్రకాష్ గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలని ఎంపిక చేశారు. 
విజేతల వివరాలు 
ఉగాది డాట్ కాం            శ్రీ రామ్ నిహారి         మొదటి బహుమతి 
అసలైన ఉగాది              మంజు                    రెండో బహుమతి 

విజయ ఉగాది               లక్ష్మీ కామకోటి        మూడో బహుమతి 


విజేతలకు అభినందనలు 
తరువాతి టపా నుండి బహుమతి పొందిన కవితలతో పాటు పోటీ కి వచ్చిన కవితలు కూడా ప్రచురింపబడతాయి.
ధన్యవాదములు  లాస్య రామకృష్ణ