Friday 2 August 2013

లాస్య రామకృష్ణ తో నిమ్మగడ్డ చంద్రశేఖర్ గారి ఇంటర్వ్యూ


బ్లాగు - వృత్తాంతి 
బ్లాగు లంకె - http://vruttanti.blogspot.in


మీ పేరు 
నిమ్మగడ్డ చంద్ర శేఖర్

మీ ఊరు 
2004 నుండి బెంగళూరులో నివాసం; 4 సంవత్సరాలు చెన్నైలో 5 సంవత్సరాలు మహారాష్ట్రలొ, అంతకు ముందు హైదరాబాదులొ వుద్యోగం

స్వస్థలం 
మాది ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దైవాలరావూరు గ్రామం

హాబీస్ 
ప్రతి రోజూ కనీసం 4 దిన పత్రికలు చదవడం, వారానికొక మంచి పద్యం బట్టీ కొట్టడం 

పుట్టిన రోజు 
జున్ 12

అభిమాన రచయిత
చెప్పడం చాలా కష్టం.  కవి సామ్రాట్ విశ్వనాథ గారి పుస్తకాల మీద కుస్తీ పడుతూ అస్వాదిస్తున్నాను. 

నచ్చే రంగు 
తెలుపు రంగు 

నచ్చే సినిమా 
ముత్యాల ముగ్గు 

ఇష్టమైన ఆహారం 
బాపట్ల ప్రాంతంలొ దొరికే వంకాయతో కూర, దోసకాయ పప్పు 

ఇష్టమైన పుస్తకం 
మను చరిత్ర - కనీసం 10 సార్లు చదివాను.  సుమారు 30 పద్యాలు, వచనం నోటికి వచ్చు 

ఇష్టమైన ప్రదేశం 
శ్రింగేరి - నన్ను నేను మర్చిపోయి, శారదా దేవి ఆలయంలో నిలబడి బమ్మెర పోతన భాగవతం నుంచి "క్షోణి తలంబు నున్నుదుట సొకగ మ్రొక్కి నుతింతు" అనే పద్యాన్ని పాడుకుంటూ ఆనందిస్తా 

జీవితం అంటే 
మానవ జీవితం చాలా చిన్నది. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించకు, పరిష్కారం వున్న సమస్యకు ఎట్లైనా సమాధానం దొరుకుతుంది కాబట్టి, అదే విషయాన్ని తీవ్రంగా ఆలొచించి వత్తిడికి గురి కావడం అనవసరం.   ఆది శంకరుడు చెప్పినట్లు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే.  మనకున్నదాంతో త్రుప్తి పడి, కష్తాల్లొ వున్న వ్యక్తికి  సాయం చేస్తే, అదే మనకు శ్రీరామ రక్ష. 

ఇతరులలో నచ్చేవి 
కొంత మంది వాక్చాతుర్యం; తెలివితేటలు 

సాహిత్యం తో మీ ప్రయాణం 
కేవలం పద్యం బ్రతికితేనే మన భాష బ్రతికేది అని కొంతమంది పెద్దల పరిచయం వలన తెలుసుకున్నాను.  5వ తరగతి నుండి 10 వ తరగతి వరకు వున్న తెలుగు పుస్తకాలను కొని భాష మీద పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. పంచ కావ్యాలను సరళమైన పుస్తకాల ద్వారా ఆకళింపు చేసుకుంటున్నాను.  పింగళి సూరన విరచిత కళా పూర్ణోదయం చదివిన తరువాత, ఒక పద్యం పై నుంచి కిందకు ఒకలా, కింద నుంది పైకి చదివితే మరోలా అర్ధం - ఇలాంటి విషయాలు తెలియని తెలుగు వాళ్ళు ఎంత కోల్పోతున్నారో అని ఆలోచిస్తా.  

మీ రోల్ మోడల్ 
అబ్దుల్ కలాం 

తెలుగు భాషకు మీ ప్రయత్నం 
నా సహాద్యాయుడు మిత్రుదు లక్ష్మీ రెడ్డి గారి ఆర్ధిక సహకారంతో, తెలుగు భాషపై మమకారం కలిగించేలా సహస్రావధాని డా|| గరికిపాటి గారి ఉపన్యాసం బెంగలూరులో ఏర్పాటు చేశాము. ఒంగోలులో జిల్లా వ్యాప్త పద్య ధారణ పోటీలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు గరికిపాటి గారిచే తెలుగు భాష గొప్పదనం తెలిపాము.   సి పి బ్రౌన్ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా స్థానిక తెలుగు మాధ్యమ ఏకోపాధ్యాయ పాఠశాలల పిల్లలను కలిసి ప్రొత్సహించాము.  జాతీయ స్థాయి పద్య, నాటక మరియు గేయ పోటీలు నిర్వహించాము (అనివార్య కారణాల వలన ఇంకా ఫలితాలు ప్రకటించలేదు).  

వృత్తి జీవితం 
నేను బి కాం; పిజిడిఎం ఎం ; పిజిడిపిఎ; ఎంబిఎ చదువుకున్నాను. ఢిల్లీ కేంద్రంగా నెలకొల్పిన పెద్ద ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలో డి జి ఎం -మార్కెటింగ్ (దక్షిణ జొన్) గా పనిచేస్తున్నాను. 

లాస్య రామకృష్ణ 





రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...