Saturday 27 April 2013

లాస్య రామకృష్ణ తో మంజు గారి మదిలో మాట


మంజు గారు బ్లాగు మిత్రుల కోసం పంచుకున్న కొన్ని వివరాలు వారి మాటల్లోనే 



"పేరు మంజు యనమదల అండి పుట్టింది కృష్ణా జిల్లా దివి తాలుకా లోని జయపురం లొ జనవరి ఇరవై ఒకటిన . సొంత ఊరు నరసింహాపురం... ఇక ఇష్టమైన అలవాట్లు అంటారా చాలా ఉన్నాయి ...పుస్తకాలు, పాటలు వినడం, వంట చేయడం, ఇదిగో ఇలా కవితలు రాయడం.... ఇంకా చాలా ఉన్నాయిలెండి. 
 నచ్చిన రచయిత అంటే చాలా మంది వున్నారు యండమూరి, మాదిరెడ్డి, కొమ్మునాపల్లి, సూర్యదేవర, మధుబాబు, విజయలక్ష్మి మురళీధర్, చిట్టా సూర్య కుమారి, నిషిగంధ, కిరణ్ ప్రభ.... ఇలా లిస్టు పెద్దదే అండి... నచ్చిన రంగు నలుపు లేత పసుపు, నచ్చిన సినిమా ఒకటంటే కష్టం చాలా ఉన్నాయి నిరీక్షణ, అంకురం ఇలా వైవిధ్య భరితమైన కధలతో వచ్చే ప్రతి సినిమా ఇష్టమే. తిండి అంటారా ఏదైనా పర్లేదు కాకరకాయ వేపుడు ఇష్టం బాగా. నచ్చే ప్రదేశం అంటే ఆకాశం సముద్రం కలిసినట్లుండే చోటు...కన్యాకుమారి బాగా ఇష్టం ఇంకా చూడలేదు కాని ఎప్పటికైనా చూడాలి అన్నంత ఇష్టం.  జీవితం అంటే ఏం చెప్పను ఇంకా దాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం లోనే ఉన్నాను. ఇతరులలో నచ్చేవి అంటే ఏమో అందరు మంచివారే కాకపొతే పరిస్థితుల ప్రభావంతో మారిపోతూ ఉంటారు...ఎదుటి వారిలో తప్పులు చూడకుండా మంచిని చూసే లక్షణం బాగా ఇష్టం. ఇష్టమైన పుస్తకం అంటే విజయానికి ఐదు మెట్లు, లక్ష్యం,, గోరువెచ్చని సూరీడు....ఇంకా చాలా ఉన్నాయి.
చిన్నప్పటినుంచి ఇష్టంతో చదివిన పుస్తకాలు బోలెడు...వాటితో పాటుగా అమ్మమ్మ తిట్టినా...స్నేహితులు పోట్లాడినా...అలా రాయడం మొదలు పెట్టి...ఉత్తరాలతో పలకరింపులు....చిన్న చిన్న కవితలతో మొదలై ఏదో ఇలా బ్లాగులో నా ఆలోచనలను, అనుభూతులను, అనిపించిన దాన్ని రాయడం మొదలు పెట్టాను. నాన్నకి సాహిత్యంతో అనుబంధం... అమ్మకు ఈ రాతలు గీతలు అస్సలు ఇష్టం ఉండదు. చందమామ తో కాకుండా ముందుగా రాధాకృష్ణ సిరియల్ తో నా పుస్తక పఠనం మొదలు అది ఇది అని లేకుండా అన్ని చదివేస్తూ ఉంటాను ఇప్పటికి.  నాకు స్పూర్తి చక్కగా రాసే అందరు. ఇక తెలుగు భాషకు నా వంతు ప్రయత్నం అంటారా ఇదిగో చూస్తూనే ఉన్నారుగా....ఈ మమకారం పోకనే అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ తెలుగు ఉందా అని వెదుక్కునేదాన్ని. ఇంజనీరింగ్ లో అయితే నన్ను అందరు తెలుగు పండితురాలు అనేవారు...ఎందుకంటే నా మొదటి ప్రశ్న " నీకు తెలుగు వచ్చా " అని... మరి మనకప్పుడు మరో భాష రాదాయే...నా పరభాషా స్నేహితులందరికీ తెలుగు నేర్పించేసాను నా ఇంజనీరింగ్ అయ్యేలోపల... ఇంకా ఏం చేయమంటారు చెప్పండి...-:) !!"  


బ్లాగు - కబుర్లు కాకరకాయలు 
http://naalonenu-manju.blogspot.in/

బహుమతి పొందిన మంజు గారి కవిత 

అసలైన ఉగాది....!!

 ఏవి ఆనాటి ఉగాది సౌరభాలు....?
కమ్మని వేప పూల సుగంధాలు 
పుల్లని మామిడి పిందెల కమ్మదనాలు 
పంచదార చెరుకు రసాలు 
షడ్రుచుల ఉగాది.... 
చక్కని జీవితాలు ఆనాడు...!!
పై పై మెరుగులు 
కల్తి సరుకులు 
గమ్మత్తైన మమకారాలు కలిపిన  
నటనే జీవితం ఈనాడు...!! 
భేషజాలు లేని మనసుల ఉగాది ఆనాడు...!!
భేషజాలతో కలగిపిన ఖరీదైన ఉగాది ఈనాడు....!!
పచ్చని తోరణాల పండువెన్నెల ఆనాడు.....!! 
పచ్చదనమే లేని కాన్వాసు రంగులు ఈనాడు....!!
ఏది ఆ మధుర కోయిల మత్తెక్కించే గానం...?
లేమావి చివురులు దొరక లేదని 
వెదికి వేసారి మూగబోయింది ఈనాడు...!!
మళ్ళి ఎప్పుడో అసలైన ఉగాది....!!

- లాస్య రామకృష్ణ 










3 comments:

  1. మంజు గారి పరిచయం బాగుంది లాస్య గారు.
    మంజుగారు, కాకరకాయ వేపుడు అంటే ఇష్టమా? అందుకే బ్లాగ్ పేరు కూడా అలా పెట్టేసారా? :)

    ReplyDelete

  2. బ్లాగులలో బ్లాగు ఆథర్స్ ని పరిచయం చేయటం ( నాకు తెలిసినంతలో ) ఓ కొత్త ప్రయోగం .
    మంజు గారు బ్లాగు తన అభీష్టానికి తగ్గట్లే ఉంది . బాగుంది కవిత అని మరో మారు చెప్పవలసిన అవసరం లేదు .
    లాస్య రామకృష్ణ గారిని అభినందించవలసినదే .

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...