Monday, 29 April 2013

లాస్య రామకృష్ణ తో కష్టేఫలే గారి ఇంటర్వ్యూపేరు:- "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాకు ఒక పేరు కాదమ్మాయ్! రెండు పేర్లు. పెద్ద కధే ఉంది మరి, చెప్పమన్నావా?  ఒక పేరు కన్నమ్మ పెట్టింది, పెంచుకున్నమ్మ పొద్దుచూసేది, చూడలేక నాకు ’భాస్కరశర్మ’ అని పేరు కన్నమ్మ చేత  పెట్టించి, తనుపొద్దు చూడటం మానేసిందిట. అలా మొదటిపేరు కన్నమ్మ పెట్టినా అది పెంచుకున్నమ్మ ఆలోచనే. ఆ తరవాత పద్నాలుగో సంవత్సరం లో పెంచుకున్నమ్మ పుట్టినప్పుడు తను పెట్టించిన పేరు మార్చేసి ’వేంకట దీక్షితులు’ అని మళ్ళీ నామ కరణం చేసింది. రెండు పేర్లూ చెప్పుకుంటాను. అప్పటికే బడిలో పుట్టినప్పటి పేరు రాసేయడం తో ఆ రోజులలో మార్పులు చేసేసావకాశం లేక మొదటి పేరుతో మిగిలిపోయా.

మీ ఊరు:- ప్రస్తుతం తూ.గో.జి లో అనపర్తి. రాజమంద్రికి ముఫ్ఫయి కి.మి. దూరం. చెన్నై-కలకత్తా మెయిన్ లైన్ మీద ఉన్నది,

స్వస్థలం;- నావన్నీ రెండేనమ్మా! పొరపాటు పడకేం ఇల్లాలు మాత్రం ఒకత్తే. :)
పుట్టింది గూటాల, ప.గో.జిలో పోలవరం దగ్గర పల్లెటూరు. పెరిగింది, మరో పల్లెటూరు, తూ.గో.జిలో దుళ్ళ, రాజమంద్రికి పదిహేనుకిలోమీటర్లు దూరం. మొత్తానికి గో.జి.లు నా పుట్టిన ఊళ్ళు.

హాబీస్:- మాకు దొరకనివి పుస్తకాలు. ’పుస్తకం ఉంటే చాలు మీకు తిండీ నీళ్ళూ అక్కరలేదు, మేమున్నామో లేదో కూడా చూడరు, అందులో ములిగిపోతారం’టుంది ఇల్లాలు. ఈ మధ్య కొత్తగా బ్లాగు రాయడం,ఫోటో లు తీయడం.

పుట్టిన రోజు:- కార్తీక బహుళ పాడ్యమి,(నవంబరు నాలుగు) విజయదశమి (అక్టోబర్ ౨౫, నేను రెండు సార్లు పుట్టేను కదా)

అభిమాన రచయిత:- శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి.

నచ్చే రంగు;- తెలుపు, బంగారు వర్ణం.

నచ్చేసినిమా:- సినిమాలు చూసి నలభయి ఏళ్ళయిందేమో! మాయాబజార్,సీతారామ కల్యాణం.

ఇష్టమయిన ఆహారం:- ఇల్లాలు చేసేదేదయినా, పనసపొట్టు కూర, పాటోళీ, మెంతి మజ్జిగ, చల్ల పులుసు.

ఇష్టమయిన పుస్తకం;-శ్రీ రామయణ,భారత, భాగవతాలు. శ్రీ పాదవారి వడ్లగింజలు, అనుభవాలూ-జ్ఞాపకాలూను, రావి శాస్త్రి మొత్తం రచనల సంపుటి చాలా పెద్దది నాలుగు వందలపైచిలుకు పేజీల పుస్తకం తెప్పించుకున్నా.

ఇష్టమయిన ప్రదేశం;- నాకు అమ్మ ఇచ్చిన స్వంత పొలం, అమ్మను చూసినట్లే ఉంటుంది.

జీవితం అంటే:- కష్ట సుఖాల కలనేత.

ఇతరులలో నచ్చేవి:- నిజం మాటాడటం.

సాహిత్యంతో మీ ప్రయాణం:- అసలు మొదలేలేదండీ!

మీరోల్ మోడల్:- శ్రీరాముడు.

తెనుగుభాషకు మీవంతు ప్రయత్నం:- ఒత్తులు పొల్లులు వదిలేయకుండా తప్పులు లేకుండా రాయడం చదవడానికి ప్రయత్నం, భాషని తప్పులు లేకుండా పలకడం :) నేను నిత్య విద్యార్ధిని.

నా బలం, బలహీనతా, మనవరాళ్ళే అయ్యారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

మనవరాలు శ్రీవిద్య తీసిన తాత గారి ఫోటో
- లాస్య రామకృష్ణ 

42 comments:

 1. Replies
  1. శిశిర గారు,
   మీ "ఎదసడి" చూశా,బావుంది.
   ధన్యవాదాలు.

   Delete
  2. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు శిశిర గారు :)

   Delete
 2. లాస్య గారూ,

  సింపుల్ గా, సూపెర్బ్ గా ఉందండీ ముఖాముఖీయం !!

  శర్మ దంపతులకి రాబోయే మే నేల స్పెషల్ అడ్వాన్స్ శుభాకాంక్షలు !!

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబి గారు,
   మీ అభిమానానికి అంజలి ఘటించి మా దంపతులు అర్పించే అభినందనలు.
   నెనరుంచాలి.

   Delete
  2. జిలేబీ గారు మీ అభినందనలకు చాలా సంతోషమండి , ధన్యవాదాలు :)

   Delete
  3. చాలా చక్కగా చెప్పారండి...!!!

   Delete
 3. చాలా బాగుంది. ధన్యవాదములు. మాష్టారి మార్క్.. ఎలా ఉన్నా బావుంటుంది.

  ReplyDelete
  Replies
  1. వనజగారు,
   మీరేమో పెద్ద టపా రాసేశారు. అమ్మాయి చి.సౌ. లాస్య చాలా కాలం కితమే నన్ను ఏమయినా చెప్పండి అంటే ఆలస్యం చేశా. మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. చాల థాంక్స్ వనజ వనమాలి గారు :)

   Delete

 4. శర్మ గారూ ,

  నమస్తే ,

  మీ దంపతులకు నా నమస్సుమాంజలులు . మిమ్మల్ని అంటే మీ ఫొటో చూసినపుడల్లా ,
  నాకెంతో ఆప్తులులా అనిపిస్తారు . ఈ రోజు మీ కుటుంబ చాయాచిత్రం కూడా అలాగే
  అనిపిస్తుంది .

  " కష్టే ఫలి " అన్న బ్లాగుకి మీ సమాధానం " నవ్వే మరి " అన్నట్లు మీ చిత్రం తెలియచేస్తోంది .

  లాస్య గారికి కృతఙ్నతలు .

  ReplyDelete
  Replies
  1. శర్మాజీ
   స్వనామధేయులకు నమస్కారం మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. ధన్యవాదాలు శర్మగారు :)

   Delete
 5. Replies
  1. సింధుగారు,
   మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. సింధు గారు, నాకు కూడా మీతో పంచుకున్నందుకు చాలా సంతోషమండి!!ధన్యవాదాలు

   Delete
 6. లాస్య గారు, ముందుగా అభినందనలు అందుకోండి.ఇంత చక్కగా మాకు కష్టేఫలే గారిని పరిచయం చేసినందుకు.వారు మా గోదావరి జిల్ల వారు కావడం నాకెంతో అనందం! వారి టప్పాలలో ఎన్నో కబుర్లు మా "పా గో జి", "తూ గో జీ" వి, వారి టపాలన్ని క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను.

  ReplyDelete
  Replies
  1. జలతారు వెన్నెలగారు,
   మనం మనం గో.జి వాళ్ళం కదండీ! మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. జలతారు వెన్నెల గారు మీ అభినందనలకు ధన్యవాదాలు :)

   Delete
 7. ఇంటర్వ్యూ బాగుందండి.

  లాస్యరామకృష్ణ గారికి ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. అనూరాధగారు,
   మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు అనురాధగారు :)

   Delete
 8. సింప్లీ సూపర్బ్ ! లాస్య గారూ, అభినందనలండీ.
  కష్టే ఫలే గారికి ( శర్మ గారికి ) శుభాకాంక్షలు !

  ReplyDelete
  Replies
  1. మిత్రులు జోగారావుగారు,
   మీ అబిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. చాల థాంక్స్ జోగారావుగారు, ధన్యవాదాలు

   Delete
 9. చాలా బాగుంది లాస్య గారు , కష్టేఫలే శర్మ గారి కి కూడా నెనర్లు

  ReplyDelete
  Replies
  1. రామకృష్ణగారు,
   మీ అభిమానాన్ని ఏమని వర్నించనూ... కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
 10. చాలా బాగుందండి శర్మ గారి తో ఇంటర్వ్యూ. వారికి శుభాకాంక్షలు.

  మీకు అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,
   మొదటి కామెంట్ దాతా నమస్కారం మీ బోణీ మంచి దండీ! మం.హా. మీ అభిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. చాల థాంక్స్ సుబ్రహ్మణ్యం గారు :)

   Delete
 11. బాగు ! భలే విశేష మిది !భాస్కర శర్మను గూర్చి మాకు మీ
  బ్లాగు ముఖా ముఖిన్ దెలియు భాగ్యము గూర్చిరి లాస్య గారు !మా
  బ్లాగరు లందు శర్మ యన భక్తి ప్రపత్తులు మెండు - అట్టె , మా
  బ్లాగరు లన్న వారి కనురాగము మిన్న - ముదంబు గూర్చెడిన్ .

  ReplyDelete
  Replies
  1. మిత్రులు లక్కాకుల వేంకటరాజారావు,
   అభిమానాన్ని ఛందోబద్దం చేసిన మీ అభిమానానికి కృతజ్ఞతలు, మీ పద్యం దాచుకుంటున్నా!
   నెనరుంచాలి.

   Delete
  2. వేంకట రాజారావు గారు , మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ అభిమానానికి కృతఙ్ఞతలు

   Delete
 12. బాగుందండీ ముఖాముఖి.. సతీ సమేతంగా శర్మ గారిని మా ముందుంచి నందుకు ధన్యవాదాలు. :)

  ReplyDelete
  Replies
  1. మధురవాణిగారు,
   మొదటగా నా బ్లాగును పదిమందిలో పెట్టినది మీరుకదా! ఈ రోజు ఇంటర్వ్యూ స్థాయికి చేర్చేశారు. మీ అభిమాన వర్షం లో తడిసి ముద్దయ్యానండి. సవినయ అంజలి ఘటిస్తున్నా.
   నెనరుంచాలి.

   Delete
  2. మధురవాణి గారు చాలా రోజుల తర్వాత కనిపించారు , మీ అభిమానానికి కృతఙ్ఞతలు :)

   Delete
 13. Replies
  1. మాలా కుమార్ గారు,
   చాలా కాలం తరవాత కలిశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

   Delete
  2. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు మలాకుమార్ గారు :)

   Delete
 14. చి.సౌ.లాస్యారామకృష్ణ గారికి,
  అభిమానంతో నా ఇంటర్వ్యూ తీసుకుని ప్రచురించాలనిపించినందుకు ధన్యవాదాలు, మొదట అడిగినపుడు ఇవ్వక ఆలస్యం చేసినందుకు క్షంతవ్యుడను. మీదంపతులకు శుభాశీస్సులు.
  నెనరుంచాలి.

  ReplyDelete
  Replies
  1. తాతగారు,ఎప్పుడూ మీ వంటి పెద్దవారి నుండి మాకు ఆశీస్సులు మాత్రమే అందాలి, క్షమాపనలు అనకండి. మీ ఆశిస్సులకు, అభిమానానికి కృతఙ్ఞతలు.

   Delete
 15. గ్రంథ నిధి

  1000+ Free Telugu E-Books Downloading Coming Soon
  With Best Compliments

  Sri Madhura Krishnamurthy Shastri
  Sri Ponnaluri Srinivasa Gargeya
  Sri Dr. B. V. Pattabhiram
  Sri Putcha Srinivasa Rao
  Sri Adipudi Venkata Shiva Sairam


  WWW.GRANTHANIDHI.COM

  ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...