Tuesday 29 January 2013

నేను బ్లాగ్ రాయడానికి ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్


బ్లాగ్ పేరు - కేఫ్ అడ్డా

రచయిత - వజ్ర దీప్ 

రచయిత మాటల్లో ఈ బ్లాగ్ గురించి 

"నేను బ్లాగ్ రాయడానికి  ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్. తన బ్లాగ్ ని regularగా  చదివే వాడిని . నేను కేఫ్ లో స్నేహితులతో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడే విషయాలు సినిమాలు, రాజకీయాలు,సామాజిక విషయాలు etc. చాలా మంది వాళ్ళ వాళ్ళ అడ్డాలో మాట్లాడే విషయాలు   mostly ఇవే. సో అలా పుట్టిందే ఈ నా కేఫ్ అడ్డా."


బ్లాగ్  ప్రత్యేకతలు 

సినిమా సమీక్షలు , మంచి సినిమాల గురించి (అంటే నాకు నచ్చిన సినిమాలు)  అందరికి తెలియజేయడం ( Awareness to  పీపుల్ who don't know), Inspirational  stuff, Social  Awareness /Causes , మంచి విషయాలు etc 

మరి ఈ వినూత్నమైన బ్లాగ్ ని చదివి వజ్ర దీప్ కి మన అభిప్రాయాలు తెలుపుదామా...




- లాస్య రామకృష్ణ 


Monday 28 January 2013

మీ బ్లాగు ఏ కోవలోకి వస్తుంది


ఎన్నో తెలుగు బ్లాగులు 

ఎన్నో అందమైన బ్లాగులు 

ఎన్నో తెలుగు రుచి చూపించే బ్లాగులు 

ఎన్నో మదిని దోచే బ్లాగులు 

ఎన్నో సంగిత బ్లాగులు 

ఎన్నో ఘుమ ఘుమల బ్లాగులు 

ఎన్నో జ్ఞాపకాల బ్లాగులు 

ఎన్నో సాహిత్య బ్లాగులు 

ఎన్నో సాంకేతిక విజ్ఞాన బ్లాగులు 

ఇలా ఎన్నో ఎన్నెన్నో బ్లాగుల ప్రత్యేకతలు 


మరి మీ బ్లాగు ఏ కోవలోకి వస్తుంది. మీ బ్లాగు ప్రత్యేకతల ను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం మీ బ్లాగుల గురించి"ఈ శిర్షిక మీదే" లో  బ్లాగ్ లోకం లో పరిచయం చెయ్యాలనుకునే వారుlasyaramakrishna@gmail.com కి మీ బ్లాగ్ లింక్ తో పాటు మీ బ్లాగ్ యొక్క ప్రత్యేకతలని అలాగే బ్లాగులతో మీ అనుబంధాన్ని, బ్లాగు ప్రయాణాన్ని, జ్ఞాపకాలని మాకు ఈమెయిలు చెయ్యండి. వీలయితే మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో  ని కూడా జతపరచండి. 

- లాస్య రామకృష్ణ 

Sunday 27 January 2013

తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం


బ్లాగు -  సుజన-సృజన

బ్లాగు రచయిత - వెంకట రాజారావు లక్కాకుల

బ్లాగు పరిచయం రచయిత మాటల్లో 







"నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రథానోపాథ్యాయులుగా పని చేసి రిటైరయ్యాను . నా బ్లాగులో పాఠశాల విద్యా పరమైన వ్యాసాలు , కథలు , చూడవచ్చు. తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం .
అందు వల్ల తెలుగు పద్య మెంత టేస్టో నా బ్లాగులో రుచి చూడ వచ్చు .
మథుర మైన గ్రామీణ తెలుగంటే నాకిష్టం . గ్రామీణ తెలుగును గ్రామ్యమని
ఈసడించే పండితుల దురహంకారమంటే కష్టం."

- లాస్య రామకృష్ణ 

Saturday 26 January 2013

అందరికీ


గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

- లాస్య రామకృష్ణ 

Wednesday 23 January 2013

"అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం"

రచయిత్రి - శ్రుతి రుద్రాక్ష్ 
పరిచయం రచయిత్రి మాటల్లోనే 

"నా పేరు. శృతి. అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నేను సంతోషంగా ఉంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే చిలిపి అమ్మాయిని. నా వాళ్ళ నవ్వు లో నా సంతోషం దాగి వుంది. తెలుగు భావాలను సంప్రదాయాలను ఇష్టపడే అందమైన తెలుగు అమ్మాయిని. రండి నా బ్లాగు ని చూద్దాం..."

ఇంకెందుకాలస్యం ఈ బ్లాగ్ ని చదివి తెలుగమ్మాయిని మనసారా అభినందిద్దామా.

- లాస్య రామకృష్ణ 


Monday 21 January 2013

బ్లాగ్ లోకం లో కొత్తగా చేరిన బ్లాగ్ విశేషాలు


బ్లాగ్ లోకం లో కొత్తగా చేరిన బ్లాగ్ - ' నా మూడు పదుల కళా సాహితీ యాత్ర'

రచయిత - తాతా రమేష్ బాబు 

రచయిత మాటల్లో ఈ బ్లాగ్ పరిచయం - తెలుగు భాష , సంస్కృతి, చరిత్ర లలో మమేకమై నేను అవి ఒకటేనన్నట్లుగా సాగుతోంది నా జీవితమ్ . గత ముడుపదుల కళా సాహితీ యాత్ర ను నా బ్లాగ్ లో రాస్తున్నాను. నా మొదటి రచన 1983 లో వెలువడిన 'అణువు  పగిలింది' నుండి నేటి 'చేవ్రాతలు' [ప్రముఖ రచయితల ఉత్తరాలు యధాతదంగా ] వరకు 30 పుస్తకాల పరిచయ విశేషాలు ప్రచురించాను. ప్రపంచం లోనే మొదటి 'తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ' ను నిర్వహించి , ' తెలుగు జానపద కళ ' అనే 272 పేజీల అధ్బుతమైన పుస్తకాన్ని తీసుకు వచ్చాను. నేను నటించిన 'లయ' , ఎదురీత' సీరియల్ ల విశేషాలు , ఆకాశవాణి లో నటించిన నాటికలు, ప్రసంగాలు, బొమ్మలాట  నాటికలు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో వుంటాయి.  

- లాస్య రామకృష్ణ 

Sunday 20 January 2013

'బ్లాగ్ లోకం' లో 'ఉగాది కవితల పోటి'

నమస్కారం,

ప్రియమైన తెలుగు బ్లాగర్లు అందరికీ నమస్సుమాంజలి.  

పోటీ వివరాలు

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశం పై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు.
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. బహుమతుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను.
9. ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

శ్రేయాభిలాషులందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు.

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ 


Saturday 19 January 2013

బ్లాగ్ లోకం లో చేరిన ఈ బ్లాగ్ ప్రత్యేకతలు



బ్లాగు పేరు - క్షీరగంగ


రచయిత - అయలసోమయాజుల శ్రీధర్ 

బ్లాగ్ లింక్ - http://sridhar-ayala.blogspot.in/ 

పరిచయం 

ఈ బ్లాగు ఉత్తమ కాల్పనిక సాహిత్యానికి పట్టుగొమ్మ అనడానికి సందేహం లేదు


ఈ బ్లాగు ప్రత్యేకతలు - అంతర్జాలంలో మొదటి నాటిక, చీకటి చకోరాలు’, మొదటి పౌరాణిక నాటకం‘ నీలగ్రహ నిదానం’, ఇంకా మరోమూడు నాటికలు,ఒక చారిత్రిక నాటకం ( వెయ్యి రూపాయలు ‘సరాగ’ పత్రికలో బహుమతి పొందినది) రెండు నవలికలు, ఒక నవల ‘పడగ మీద మణి’ ప్రచురించబడ్డాయి. ౧౫౮ పోస్టింగులు జరిగాయి. ప్రస్తుతం ఒక డైలీసీరియల్ ‘ ‘మొసలికొలను మ్యూజియం’ ప్రచురణ జరుగుతోంది. 

ఇంకెందుకాలస్యం ఈ బ్లాగుని విహంగ వీక్షణం చెయ్యండి మరి. 

మరిన్ని బ్లాగుల పరిచయంతో మరిన్ని ప్రత్యేకతలతో మీ ముందుకు రాబోతుంది మీ బ్లాగులోకం.

- లాస్య రామకృష్ణ 

Wednesday 16 January 2013

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.



మీ బ్లాగులని కూడా బ్లాగులోకంలో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం, lasyaramakrishna@gmail.comకి మీ బ్లాగ్ లింక్ ని మెయిల్ చెయ్యండి.  

- లాస్య రామకృష్ణ 

Sunday 13 January 2013

దీన్ని చూసారా ...




అందమైన రంగు రంగుల ముగ్గు
 పండుగ పర్వదినం సందర్భంగా
మన బ్లాగ్ లోకం లో చోటు చేసుకుంది. 

- లాస్య రామకృష్ణ 



Sunday 6 January 2013

ఏ ఆర్ రహమాన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Saturday 5 January 2013

రజనీ కాంత్ వల్ల రచయితగా మారిన డైరెక్టర్ సురేష్ కృష్ణ


డైరెక్టర్ సురేష్ కృష్ణ గారిచే రచింపబడిన "మై డేస్ విత్ బాషా" అనే పుస్తకం అమితమైన ఆసక్తిని కలిగిస్తోంది. రజనికాంత్ గురించి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో తెలిపారు.

- లాస్య రామకృష్ణ 

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...