'ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది
ఎర్రగా ఉంటే బాగుండదు గనక
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది
నీలంగా ఉంటే బాగుండదు గనక
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది
నల్లగా ఉంటే బాగుండదు గనక'
ఇలాంటి కామెడీ తవికలు రాయడంలో మీరు సిద్ధహస్తులా?
అయితే ఈ పోటీ మీ కోసమే.
సంక్రాంతి కామెడీ కవితల పోటీ...సారీ సారీ తవికల పోటీకి సిద్ధమవ్వండి.
మీలోనున్న హాస్యరసాన్ని వెలికితీసి వినోదాన్ని పండించండి.
జంధ్యాల 'చంటబ్బాయ్' చిత్రంలోని శ్రీలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని మీ తవికలతో దూసుకెల్లండి
ఇంకెందుకాలస్యం feedbackattelugu@gmail.com కి మీ తవికలను మెయిల్ చేయండి. తవిక మీ సొంతమేనని హామీ పత్రాన్ని జతచేయండి. తవికని 'బ్లాగ్ లోకం'లో ప్రచురించాక మీరు మీ బ్లాగ్ లలో ప్రచురించుకోవచ్చు.
- లలిత లాస్య