Thursday 21 March 2013

ఆడవాళ్లకు మాత్రమే


మహిళల సమస్యలకి ప్రత్యేకమైన బ్లాగు 


- లాస్య రామకృష్ణ 


Tuesday 19 March 2013

కాలం ఒక్క సారి వెనక్కెళితేబ్లాగు - చిన్ని ఆశ 

బ్లాగర్ - చిన్ని ఆశ బ్లాగు పరిచయం రచయిత మాటల్లో 

"జీవితంలో పెద్దవి, చిన్నవి ఆశలనేకం. అందులో తీరినవీ, తీరనివీ, తీరాలని ఆశపడేవీ, మరో జన్మలోనైనా తీరితే చాలు అని ఆరాట పడేవీ...ఇలా ఎన్నెన్నో ఆశలతో జీవితం సాగిపొతుంది. అందులో కొన్ని దగ్గరే ఉన్నా వాటిని గుర్తించక అవి పోయాక వాటి కోసం తపన పడుతూ, కాలం ఒక్క సారి వెనక్కెళితే మళ్ళీ వాటిని తనివితీరా ఆశ్వాదించాలని ఆరాటపడే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నైనా తప్పదు. అలా ఆరాటాలుగా మిగిలిపోయే "చిన్ని ఆశ"లు మన గుండె లోతుల్లోంచి బయటకి వచ్చి చెప్పుకోగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనే మా ఈ "చిన్ని ఆశ". మా భావాలను కవితలూ, అందమైన ఊహలు, బొమ్మల రూపంలో ప్రెజెంట్ చేస్తుంటాము."


- లాస్య రామకృష్ణ 

Sunday 17 March 2013

గడువు పొడిగించబడింది

చాలా కవితలు గడువు తేదీ ముగిసే సమయానికి రావడం వల్ల ఉగాది కవితల పోటి గడువు ఏప్రిల్ 5, 2013 సాయంత్రం 6:00 (భారతీయ కాలమానం ప్రకారం) వరకు పొడిగించబడింది. గమనించగలరు. 

పోటీ వివరాల్లోకి వెళితే 


పోటీ వివరాలు

ఉగాది కవితల పోటికి తెలుగు లో బ్లాగు నడుపుతున్న ప్రతి ఒక్కరు అర్హులే.

1.'ఉగాది అప్పుడు ఇప్పుడు' లేదా 'ఉగాది' అనే అంశాలపై కవితలని ఉగాది కవితల పోటీకి ఆహ్వానిస్తున్నాం.
2.కవిత కనీసం పది లైన్లు కలిగి ఉండాలి.
3.ప్రచురితం కాని కవితలనే పంపవలెను.
4.ఒక్కొక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చు. 
5.ఉగాది రోజున విజేతలను ప్రకటిస్తాం.
6.పోటీ కి వచ్చిన కవితల క్రెడిట్ ని ఆ రచయిత లేదా రచయిత్రులకి ఇస్తూ వీలువెంబడి ఆ కవితలను 'బ్లాగ్ లోకం' లో ప్రచురిస్తాము.
7.మీ కవితలను 'lasyaramakrishna@gmail.com' కి ఇ-మెయిల్ చెయ్యాలి.
8. మీ కవితతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ లింక్ మరియు మీ పరిచయం పంపించాలి. ఇష్టమైతే పాస్ పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ కూడా పంపించవచ్చు.
9. పోటీ కి వచ్చిన కవితలలో అర్హత పొందినవి రచయిత పరిచయంతో  బ్లాగ్ లోకం లో ప్రచురించడం జరుగుతుంది. 
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
11.బహుమతుల వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

త్వరపడండి మరి......

ధన్యవాదాలు
లాస్య రామకృష్ణ Thursday 14 March 2013

నా స్వగతాలన్నింటిని పొందుపర్చుకోవాలన్న తపనే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.

బ్లాగ్ పేరు - వినాయక వీణ 

బ్లాగర్ - శ్రీనివాస్ వాసుదేవ్ 

బ్లాగ్ పరిచయం రచయిత మాటల్లో 

"నా బ్లాగ్ గురించి నాలుగుమాటలు:

1. అయిదేళ్లక్రితం నన్ను నేను ఆవిష్కరించుకునే నేపథ్యంలొ ప్రారంభించినది. నా స్వగతాలన్నింటిని పొందుపర్చుకోవాలన్న తపనే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.

2. ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ గోరా శాస్త్రిగారు నా మామగారు. ఆయన అప్పట్లో "వినాయకుడివీణ" అనేపేరుతో ఓకాలమ్ నడిపేవారు. ఆపేరునే మార్చి ఇలా...ఆయన గతంలో ఆంధ్రభూమికి, డక్కన్ క్రానికల్ కి ఒకేసారి రెండుభాషల్లోనూ సంపాదకీయం రాసేవారు.

3. తెలుగుభాషపై మమకారం నా రచనలకి ప్రధానకారణం. ప్రధానంగా ఈ బ్లాగ్లొ కవితలు ప్రచురిస్తాను. కథలు రాస్తున్నా వాటిని నా బ్లాగులో పబ్లిష్ చెయ్యలేదు. 

4. మంచి సాహిత్యం చదవాలీ, చదివించాలన్న సాహిత్యాభిలాషే ముఖోద్దేశ్యం."

- లాస్య రామకృష్ణ 

Thursday 7 March 2013

మార్చ్ 15 లోపల మీ కవితలు పంపించండి


ఉగాది కవితల పోటీ సందర్భంగా మీ కవితలు మార్చ్ 15 లోపల lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి.

ధన్యవాదములు
లాస్య రామకృష్ణ 

Monday 4 March 2013

అమ్మాయిలకు సహజంగానే ఆసక్తి

ఆభరణాలంటే అమ్మాయిలకు సహజంగానే ఆసక్తి. అలాంటి ఆభరణాలలో ప్రత్యేకతలు ఇంకా లేటెస్ట్ డిజైన్ ల తో మిమ్మల్ని అలరించడానికి కొత్తగా jewellery గారిచే ప్రారంభమైన బ్లాగు "Jewellery"


ఇంకెందుకాలస్యం చూసి ఆనందించండి మరి 

బ్లాగు లంకె - Jewellery  
http://cuteandbeautifuljewellery.blogspot.in

- లాస్య రామకృష్ణ 

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...