Saturday, 29 September 2012

ఉత్తమ టపా - 29th Sep 2012


నా మాట  

ఎన్నో సూర్యోదయాలు 
ఎన్నో సూర్యాస్తమయాలు 
ఎన్నో వెన్నెల రాత్రులు 
ఎన్నో అందమైన సాయంత్రాలు
బాల కార్మికుల జీవితాలలో మాత్రం మార్పు లేదు
వారికి విముక్తి ఎప్పుడు 
ఈ ప్రకృతిలోని అందాన్ని ఆనందించేది ఎప్పుడు 
బాల్యంలోని ఆనందాన్ని రుచిచుసేది ఎప్పుడు 

బాలకార్మికుల గురించి చట్టం ఉన్నా ఇంకా చాలా హోటల్స్ లో రకరకాల పారిశ్రామిక రంగాలలో బాలకార్మికులు తమ బాల్యాన్ని పణంగా పెడుతూనే ఉన్నారు. 
అటువంటి వారిని ప్రోత్సహించకుండా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

ఉత్తమ టపా :- ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా అంతరిక్షంలో నువ్వూ నేనూ. 

అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా ఒక సగటు మనిషికి కలిగే సందేహాలన్నీ నివృత్తి పరిచే పోస్ట్ ఇది. ఈ ఆర్టికల్ ని నాలుగు భాగాలుగా పోస్ట్ చేసారు. మంచు గారు మధురవాణి  గారు కలిసి రచించారు.అన్ని కోణాలనుంచి విశ్లేషించి చాలా బాగా రాసారు.

అంతరిక్షంలో నువ్వూ నేనూ
లంకె

 
మధురవాణి గారికి, మంచుగారికి అభినందనలు.

ఈ టపాని ఉత్తమ టపా గా సజెస్ట్ చేసిన భాస్కర్(the tree) గారికి ధన్యవాదములు.

మంచి మాట :- ప్రార్ధించే పెదవుల కన్నా  చేసే చేతులు మిన్న.
- లాస్య రామకృష్ణ 


Wednesday, 26 September 2012

ఉత్తమ టపా ని మీరు ఎన్నుకోవచ్చు


ఉత్తమ టపా ఎంపికలో మీరు సహకరించండి. మన దృష్టికి రాని మంచి టపాలని అందరితో పంచుకోండి.

ఆ టపాలు ఈ మధ్యన పోస్ట్ చేసినవైన, లేదా ARCHIVES లో నుంచైనా పర్వాలేదు.

ఉత్తమ టపా ఎంపికలో నాకు సూచించిన వారి పేరుని వారి ఇష్టానుసారం ప్రచురిస్తాను.

కామెంట్స్ రూపం లో గాని లేదా మెయిల్ (lasyaramakrishna@gmail.com) ద్వారా గాని నాకు మీరు చదివిన మంచి టపా గురించి తెలియచేయండి.


- లాస్య రామకృష్ణ 

Saturday, 22 September 2012

ఉత్తమ టపా - 22nd Sep 2012


నా మాట :-

ఇల్లాలికి వేతనం అనే అంశంపై ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం పై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లాలికి వేతనం ఇచ్చి పనిమనిషి గా ఆమె శ్రమకి వెల కడతారా అని కొందరి అభిప్రాయమైతే, ఇల్లాలి శ్రమని ఈ విధంగానైనా గుర్తిస్తున్నారు. గృహ హింస తగ్గే అవకాశాలున్నాయి అని కొందరి అభిప్రాయం. 

ఇరవై నాలుగు గంటలూ తన వారి కోసం శ్రమ పడిన ఇల్లాలికి కొంచెం నలతగా ఉంటే కనీసం ఎలా ఉన్నావు అని పట్టించుకోని ఘనులున్న సమాజంలో ప్రభుత్వం వారి ఆలోచన కొంచెం ఆశాజనకంగా ఉంది. 

ఇంట్లో పట్టెడు అన్నం మాత్రమే ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరికీ పంచి తను మాత్రం పస్తులు ఉంటుంది. 

"ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు"  అని చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే చదువుకున్న ఇల్లాలు ఇంటి కి సంబంధించిన నిర్ణయాలు చక్కగా అలోచించి తీసుకుంటుంది, ఆరోగ్యవంతంగా ఇంటిని, ఇంట్లోని సభ్యులని ఉంచుతుందని.

అదే విధంగా ఇల్లాలికి ఆర్ధిక స్వాతంత్రం కూడా ముఖ్యం. ఇంకా ఈ సమాజంలో "Gender discrimination" (లింగ వివక్ష) అన్నది అంతర్లీనంగా ఉంది. తమకంటూ డబ్బుని స్వతంత్రంగా ఖర్చు పెట్టే కనీస అర్హత కూడా లేదు.

తన హక్కు కోసం తనూ పోరాడే రోజు, తన గురించి తనూ శ్రద్ద తీసుకునే రోజు రావాలని కోరుకుందాం. ఎందుకంటే, "ఇల్లాలి అర్యోగ్యం ఇంటికి ఆరోగ్యం కాబట్టి".

ఇల్లాలిని సముచితంగా చూస్తూ గౌరవించే చూసే భర్తలూ  ఉన్నారు.  అటువంటి వారికి హాట్సాఫ్.

ఉత్తమ టపా :-

ఈ వారం ఉత్తమ టపా లో చోటు చేసుకున్న టపా "ధ్యానం - నీ లోనికి నీ పయనం". స్మరణ అనే బ్లాగు లోంచి తీసుకోబడినది. రచయిత్రి భారతి గారు. 

భారతి గారు ఆధ్యాత్మిక విషయాలని పామరులకు సైతం అర్ధం అయ్యే రీతిలో ఈ బ్లాగుని తీర్చిదిద్దారు.  

ఈ వారం ఉత్తమ టపా లంకె - "ధ్యానం - నీ లోనికి నీ పయనం",

మంచి మాట : -

 "సత్యానికి అప్పుడప్పుడూ గ్రహణం పడుతుంది గాని పూర్తిగా అదృశ్యం కాదు."


 - లాస్య రామకృష్ణ Wednesday, 19 September 2012

బ్లాగు మిత్రులకి వినాయక చవితి శుభాకాంక్షలు - ప్రతి శనివారం "ఉత్తమ టపా" తో మీ ముందుకు రాబోతోంది మీ "బ్లాగ్ లోకం"

బ్లాగు మిత్రులకి  వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి శనివారం "ఉత్తమ టపా" తో మీ ముందుకు రాబోతోంది మీ "బ్లాగ్ లోకం"

- లాస్య రామకృష్ణ 

Saturday, 15 September 2012

ఈ వారం ఉత్తమ టపా ప్రారంభోత్సవం

నమస్కారం అండీ, 

దాదాపు వారం కావస్తోంది. ఎంత త్వరగా గడిచిపోతున్నాయి రోజులు. కాని ఈ వారంలో ఎన్నో మార్పులు జరిగాయి. అటు రాజకీయపరంగా కాని, సినిమాపరంగా కాని.
ఇప్పుడు విషయం లోకి వస్తే, బ్లాగు ప్రపంచంలో మనల్ని ఎన్నో బ్లాగులు అకట్టుకుంటాయి. కొన్ని బ్లాగులు అలోచింపచెస్తే, కొన్ని బ్లాగులు సరదాగా నవ్విస్తాయి, మరికొన్ని బ్లాగులు సంగీతం లో ఊయలలూగిస్తాయి.
తనదైన ప్రత్యేక శైలిని అలవరించుకొని బాబాయిగారు, తాతగారు అని పిలిపించుకుంటూ మన కుటుంబంలొని వ్యక్తిలా ఎన్నో పురణగాధలను తెలియచెస్తూ, అప్పుడప్పుడూ తన జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్న కష్టేఫలి గారితో మన శిర్షిక " ఈ వారం ఉత్తమ టపా" ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

లంకె -  శర్మ కాలక్షేపంకబుర్లు-ఆనందం

ఆనందం అనే ఈ టపా లో కష్టేఫలి గారు, ఆనందం అనే మాటని చాలా బాగా విశ్లేషించారు."వేదాంతంలో నిత్యమైనది ఆనందం. ఒక క్షణం ఉండి మరొక క్షణం లో పోయేది కాదు. నిత్యమైన ఆనందం (మన రంజిత నిత్యానందుడు కాదు)ఎప్పుడూ ఉండేది అదే నిత్యానందం బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మ, అదే దైవం." అని ఆనందం గురించి వివరించారు.శర్మ గారి టపాలన్నీ ఆణిముత్యాలే. ఆ అణిముత్యాల్లోంచి మరొకసారి చదువుకుందామని ఈ ఆణిముత్యం లింక్ ఇచ్చాను.

- లాస్య రామకృష్ణ 

 Wednesday, 12 September 2012

ఈ వారం ఉత్తమ టపా...

బ్లాగు మిత్రులకి నమస్కారం,
నాకు నచ్చిన బ్లాగ్స్ కోసమే ఈ బ్లాగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా మరెన్నో ముత్యాల్లాంటి బ్లాగ్స్ ని నేను చదివి ఉండకపోవచ్చు. అలాంటి బ్లాగ్స్ గురించి నాకు తెలియచేస్తే నేను ఇందులో జత పరుస్తాను.

అయితే ప్రతి వారం, ఈ బ్లాగు లో 'ఈ  వారం ఉత్తమ టపా' గా నేను ఒక టపా గురించి ప్రస్తావిస్తాను.

 నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం ఉండాలని అభిలషిస్తూ...

- లాస్య రామకృష్ణ 


రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...