Monday, 21 January 2013

బ్లాగ్ లోకం లో కొత్తగా చేరిన బ్లాగ్ విశేషాలు


బ్లాగ్ లోకం లో కొత్తగా చేరిన బ్లాగ్ - ' నా మూడు పదుల కళా సాహితీ యాత్ర'

రచయిత - తాతా రమేష్ బాబు 

రచయిత మాటల్లో ఈ బ్లాగ్ పరిచయం - తెలుగు భాష , సంస్కృతి, చరిత్ర లలో మమేకమై నేను అవి ఒకటేనన్నట్లుగా సాగుతోంది నా జీవితమ్ . గత ముడుపదుల కళా సాహితీ యాత్ర ను నా బ్లాగ్ లో రాస్తున్నాను. నా మొదటి రచన 1983 లో వెలువడిన 'అణువు  పగిలింది' నుండి నేటి 'చేవ్రాతలు' [ప్రముఖ రచయితల ఉత్తరాలు యధాతదంగా ] వరకు 30 పుస్తకాల పరిచయ విశేషాలు ప్రచురించాను. ప్రపంచం లోనే మొదటి 'తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ' ను నిర్వహించి , ' తెలుగు జానపద కళ ' అనే 272 పేజీల అధ్బుతమైన పుస్తకాన్ని తీసుకు వచ్చాను. నేను నటించిన 'లయ' , ఎదురీత' సీరియల్ ల విశేషాలు , ఆకాశవాణి లో నటించిన నాటికలు, ప్రసంగాలు, బొమ్మలాట  నాటికలు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో వుంటాయి.  

- లాస్య రామకృష్ణ 

No comments:

Post a Comment

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...