Wednesday, 30 December 2015

తెలుగు బ్లాగ్ లోకానికి కూడలి షాక్


కూడలి సెలవు తీసుకుంటోంది. 
తెలుగు బ్లాగ్ లోకానికి అత్యంత సేవ చేసిన కూడలి ఈ నిర్ణయానికి రావడం బాధాకరం.  
వియ్ మిస్ యూ కూడలి




Friday, 25 December 2015

ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది..!! - సంక్రాంతి కామెడీ తవికల పోటీ

'ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది
ఎర్రగా ఉంటే బాగుండదు గనక 
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది 
నీలంగా ఉంటే బాగుండదు గనక 
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది 
నల్లగా ఉంటే బాగుండదు గనక'

ఇలాంటి కామెడీ తవికలు రాయడంలో మీరు సిద్ధహస్తులా?
అయితే ఈ పోటీ మీ కోసమే. 

సంక్రాంతి కామెడీ కవితల పోటీ...సారీ సారీ తవికల పోటీకి సిద్ధమవ్వండి. 
మీలోనున్న హాస్యరసాన్ని వెలికితీసి వినోదాన్ని పండించండి. 
జంధ్యాల 'చంటబ్బాయ్' చిత్రంలోని శ్రీలక్ష్మిని ఆదర్శంగా తీసుకుని మీ తవికలతో దూసుకెల్లండి

ఇంకెందుకాలస్యం feedbackattelugu@gmail.com కి మీ తవికలను మెయిల్ చేయండి. తవిక మీ సొంతమేనని హామీ పత్రాన్ని జతచేయండి. తవికని 'బ్లాగ్ లోకం'లో ప్రచురించాక మీరు మీ బ్లాగ్ లలో ప్రచురించుకోవచ్చు. 

- లలిత లాస్య 

  

Thursday, 24 December 2015

సంక్రాంతి తవికల పోటీ



వునండీ...
మీరు కరక్ట్ గానే చదివారు. 
తవికల పోటీనే. 
మరిన్ని వివరాలు...
త్వరలో...

ప్రేమిస్తే సరి...!!



ప్రపంచాన్ని శాసించాలని అనుకోకు 
ప్రేమిస్తే సరి
శత్రువుని నాశనం చేయాలని అనుకోకు 
స్నేహంతో కట్టిపడేస్తే సరి
స్వార్థాన్ని అంతమొందించాలని అనుకోకు 
నిస్వార్ధంలోనున్న గొప్పదనాన్ని తెలియజేస్తే సరి 

- లలిత లాస్య 

Wednesday, 23 December 2015

ఎవరు నువ్వు?


Image  Courtesy - Google 

పదాల 
పదనిసల 
తికమక 
జిలిబిలి 
పలుకుల 
మకతిక 
ఎవరు నువ్వు?

- లలిత లాస్య 






Tuesday, 22 December 2015

చిన్నమాట

Image Courtesy - Google

మాటను తాకలేము 
కాని మాట మనసుని తాకుతుంది 
పెదవి దాటని మాట మనకి బానిస 
పెదవి దాటిన మాటకు మనము బానిస 
- లలిత లాస్య 


Monday, 21 December 2015

మురిపాల వెన్నెలసోన

Image Courtesy - Google 

పసితనాల పసిడి జ్ఞాపకాలు 
ఆనాటి ఆటలు, పాటలను 
గుర్తుకు తెచ్చే పసికూన 
నీ పాలనవ్వుల్లోనే మురిపాల వెన్నెలసోన 

- లలిత లాస్య 

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...