రచయిత - శ్రీరాం నిహార్ ముసునూరి
ఉగాది డాట్ కామ్!
-----
ఉగాది వచ్చేసిందా...? ఉషస్సే కనిపించలేదు!
కాంక్రీటు జంగిల్లో బతికేస్తున్నాం కదా?!
అంతస్థుల తెరల వెనుక...
ఎన్ని ఉషోదయాలో.. ఎన్ని అస్తమయాలో?!
ఎడారులు పరుచుకున్ననగర జీవితం
ఎన్ని వసంతాలొస్తే చిగురిస్తుంది ?
టెర్రస్ మీద పెరడును సృష్టిస్తే
పల్లె సోయగమెలా పరిమళిస్తుంది ?!
ఇరుకు వరండాల్లో మరుగుజ్జు వృక్షాలు
ఏనాటికైనా కొత్త చిగుర్లు తొడుగుతాయా?!
గాలీవెలుతురూ తెలియని 2BHK ఫ్లాట్లు
ఇక ప్లాస్టిక్ మొక్కలు ప్రాణవాయువునిస్తాయా?
సోషల్ మీడియాతో ప్రపంచానికి కనెక్టయ్యాం
మన ఒంటరిదనానికి కొత్త వేకువలెలావస్తాయి?
పండగా, పబ్బం 'వసుదైకకుటుంబకం' అనుకుంటేనేగా...
మనం విడిచిపెట్టిన ఆసరాల జాడెక్కడో వెతుక్కుందాం!
ఉగాది వచ్చేసింది... కృత్రిమ ప్రకృతి సృష్టించుకుందాం!
జనారణ్యంలోకి మర కోయిలలను ఆహ్వానించండి
రింగ్ టోన్లలో పక్షి గొంతులు ట్యూన్ చేద్దాం!
గాడ్జెట్లతో నడిచే బతుకులకు కుహూరవాలు వినిపిద్దాం!!
తలుపులే తెరవని వాకిళ్లలో...
కాగితపు పూలదండలు వేళ్లాడేద్దాం!
గడపలెరుగని లోగిళ్లలో...
కాగితపు ముగ్గుల షీట్లు అతికించేద్దాం!
రొటీన్ లైఫుల్లో ఆమ్ఆద్మీలకు పరవన్నాలెక్కడివి?
పండుగొచ్చిందిట...స్వగృహకెళ్లి నోరుతీపి చేసుకుందాం!
'పచ్చ' కళ్లజోడెట్టేసుకోండి...
నిలబడిన చోటికే పచ్చదనాన్ని రప్పిద్దాం!
న్యూక్లియర్ ఫ్యామిలీలైపోయాముగా...
సినిమా 'ఉమ్మడి కుటుంబాలు' సేదదీరుస్తాయి !
బుల్లితెర ముందుకూర్చున్నామంటే-
'పరాయితనం' తెలియని సందడొచ్చేస్తుంది!
మనక్కావాల్సినవి కోయిల కూత, వేపపూతా...
'ఫేస్ బుక్'లో వాటి జాడ వెతుక్కోగలమా?
క్రమం తప్పని నవవసంతం వచ్చేసిందిట...
మన ఇంటికీ రమ్మని ఓ ఎస్ఎంఎస్ పంపుదామా...?!
- లాస్య రామకృష్ణ
బాగుంది. నిహార్ గారు కవితలు రాస్తారనమాట!
ReplyDeleteవారికి శుభాకాంక్షలు
abinandanalu
ReplyDelete
ReplyDeleteగతం స్మృతులుగా మిగిలిపోతున్నాయన్నది అక్షర సత్యమే , కానీ అదే భవిష్యత్తుకి అసలైన పునాది .
అభినందనీయం .
congratulation nihaar garu, nice one:))
ReplyDeleteనా కవితను ఉగాది కవితల పోటీలో మొదటి బహుమతికి ఎంపిక చేసిన లాస్య రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. నా బ్లాగును క్రమం తప్పకుండా చదువుతూ నచ్చిన కథనాలపై అభిప్రాయాలను తెలియచేస్తున్న జలతారువెన్నెలగారు ఈ కవితకూ అందరి కంటే ముందుగా స్పందించడం ఆనందంగా ఉంది. అభినందించిన మిత్రులు... చెప్పాలంటే గారు, శర్మగారు, శృతి రుద్రాక్క్ష్ తదితరులందరికీ థాంక్స్.... నిహార్, హైదరాబాద్.
ReplyDeleteనా కవితను ఎంపిక చేసినందుకు లాస్య రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. కవితపై స్పందించిన వారికి, అభినందించిన వారికీ కృతజ్ఞతలు. జలతారువెన్నెల, చెప్పాలంటే, శర్మ, శృతిరుద్రాక్ష్ తదితరులందరికీ థాంక్స్... నిహార్
ReplyDelete