Thursday 11 July 2013

లాస్య రామకృష్ణ తో మాలా కుమార్ గారి ఇంటర్వ్యూ


బ్లాగు - సాహితి 

ఇతర బ్లాగులు 

పేరు
మాలాకుమార్(అసలు పేరు కమల అనుకోండి , మాల గా మారిపోయి అదే చలామణి అవుతోంది:))

మీ ఉరు
హైదరాబాద్

స్వస్తలం
అంటే పుట్టింటివారిది నందిగామ , అత్తింటివారిది ఖమ్మం . కాని రెండు చోట్లకు అప్పుడప్పుడు బంధువులను కలిసేందుకు వెళ్ళిరావటం తప్ప ఎప్పుడూ వుండలేదు.

హాబీస్
చాలా వున్నాయి:)ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే వుంటాను.కాని ముఖ్యమైనది నవలలు చదవటం.

పుట్టినరోజు
25 జులై

అభిమాన రచయిత
చాలా మంది వున్నారు . యద్దనపూడి సులోచనారాణి, పొత్తూరి విజయలక్ష్మి, మల్లాది , ఆనందారామం, కావలిపాటి విజయలక్ష్మి, చిట్టారెడ్డి సూర్యకుమారి, మాదిరెడ్డి సులోచన అబ్బో ఇలా చాలా మంది వున్నారు.

నచ్చేరంగు
లేత రంగులు , తెలుపు , లేత గులాబి

నచ్చే సినిమా
కొట్టుకోవటాలు , రక్తపాతాలు లేని ఏవైనా చక్కని కుటుంబకథా చిత్రాలు, వెకిలి హాస్యం లేని హాస్య చిత్రాలు నచ్చుతాయి.కొంచం మూడ్ బాగాలేనప్పుడల్లా పాత మిస్సమ్మ చూస్తుంటాను:
ఇష్టమైన ఆహారం
మసాలాలు లేని ఏదైనా శాఖాహారం

ఇష్టమైన పుస్తకం
ఏవైనా చాలా లైట్ గా వుండేవి,ముఖ్యం గా హాస్య పుస్తకాలు ఇష్టం. మధ్య చదివినవాటిల్లో నచ్చింది, మల్లాది "సద్దాం ఆంటీ ఇంటి కథ."

ఇష్టమైన ప్రదేశం
డార్జిలింగ్, హిమాలయాలు . ఎప్పటికైనా హిమాలయాలలో స్తిరపడాలని నా చిరకాల కోరిక

జీవితం అంటే
కష్టసుఖాల కలనేత చీర
ఇతరులలో నచ్చేవి 
మృదు సంభాషణ

సాహిత్యం తో మీ ప్రయాణం
మా పుట్టింట్లో అందరూ కొద్దో గొప్పో సాహిత్యం అంటే అభిమానం వున్నవారే. మా మామయ్యలు, అమ్మా , పిన్నీ కలిసి నప్పుడల్లా సాహిత్య చర్చలు జరుగుతూవుంటాయి. నా చిన్నప్పుడే మా అమ్మ, కళాపూర్ణోదయం , ఆరుద్ర సమగ్ర ఆంధ్ర చరిత్ర , బారిస్టర్ పార్వతీశం , గణపతి, బుడుగు,టాంసాయర్ లాంటి పుస్తకాలు చాలా చదివించింది.అలా చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు.  2008 లో బ్లాగ్” సాహితి” మొదలుపెట్టి నప్పటి నుంచి ఏదో వ్రాయటం అలవాటైంది.
మీ రోల్ మోడల్
మా అత్తగారు.

తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
తెలుగులో వ్రాయటం, తెలుగు చదవటం,మనవళ్ళకూ మనవరాళ్ళకు తెలుగు నేర్పించి, తెలుగు కథలు చెప్పటమే :)

- లాస్య రామకృష్ణ


22 comments:

  1. మాలగారూ,
    మీ పరిచయం బాగుంది.
    పాత మిస్సమ్మ నచ్చే మీకు మీరు చెప్పిన నవలాకారిణులు నచ్చటం ఆశ్చర్యం కలిగించింది.

    నా రోల్‌మోడల్ మా అత్తగారు అనే కోడళ్ళు కూడా ఉంటారన్న మాట!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete
  2. మంచి గొప్ప పరిచయం.కొత్త మిస్సమ్మ అనుకుంటా కదా! మౌనంగానే ఎదగమనీ..... ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete
  3. లాస్య రామకృష్ణ గారితో మాలాకుమార్ గారి ముఖాముఖి చదవబుల్ గా బాగుంది!కాని వారి అభిమానరచయితలజాబితా శ్యామలీయంగారిలాగే నాకూ నిరాశ నిస్పృహ కలిగించి వారింకా గ్రంధపటనంలో మరింత ఎదగాలని అనిపించింది!

    ReplyDelete
    Replies
    1. సూర్య ప్రకాష్ గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete
  4. శ్యామలీయం గారు, నా పరిచయం నచ్చినందుకు చాలా థాంక్స్ అండి.
    నిజంగానే మా అత్తగారు నా రోల్ మోడల్ అండి:)అసలు చదువుకోని ఆవిడ , ఇంటిని దిద్దిన పద్దతి,చాల కష్టమైన సమస్యలని కూడా ఆవిడ పరిష్కరించే విధానం , ముఖ్యంగా ఎలాంటి పరిస్తితులలోనూ చెరగని ఆవిడ చిరునవ్వు నాకు చాలా నచ్చేవి.ఆవిడలాగా ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకునేదానిని , ఇప్పటికీ అనుకుంటాను. కాని నేర్చుకోలేకపోయాను:)

    & శర్మగారు థాంక్స్ అండి.కొత్త మిస్సమ్మ కాదు , పాత మిస్సమ్మే నచ్చే సినిమా. ఆ పాట అందులోది కాదనుకుంటా . ఎందులోదో మరి.

    & సూర్యప్రకాశ్ గారు,
    నా ఇంటర్వ్యూ నచ్చినందుకు థాంక్స్ అండి. నా అభిమాన రచయతల జాబితా మీకు చాలా నిరాశ కలిగించినందుకు సారీ అండి.మా అమ్మ కూడా నేను నీకు చదవటం నేర్పించిన పుస్తకాలేమిటి, నువ్వు చదువుతున్నవేమిటి అని కలిసి నప్పుడల్లా కోపం చేస్తునేవుంటుంది:)నా దగ్గర వున్న పుస్తకాలు చూస్తుంటే ఆవిడకు వళ్ళు మండిపోతూవుంటుంది:)ఏమో నండి అలా అలావాటైపోయింది.

    ReplyDelete
  5. శ్యామలీయం గారు, నా పరిచయం నచ్చినందుకు చాలా థాంక్స్ అండి.
    నిజంగానే మా అత్తగారు నా రోల్ మోడల్ అండి:)అసలు చదువుకోని ఆవిడ , ఇంటిని దిద్దిన పద్దతి,చాల కష్టమైన సమస్యలని కూడా ఆవిడ పరిష్కరించే విధానం , ముఖ్యంగా ఎలాంటి పరిస్తితులలోనూ చెరగని ఆవిడ చిరునవ్వు నాకు చాలా నచ్చేవి.ఆవిడలాగా ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకునేదానిని , ఇప్పటికీ అనుకుంటాను. కాని నేర్చుకోలేకపోయాను:)

    & శర్మగారు థాంక్స్ అండి.కొత్త మిస్సమ్మ కాదు , పాత మిస్సమ్మే నచ్చే సినిమా. ఆ పాట అందులోది కాదనుకుంటా . ఎందులోదో మరి.

    & సూర్యప్రకాశ్ గారు,
    నా ఇంటర్వ్యూ నచ్చినందుకు థాంక్స్ అండి. నా అభిమాన రచయతల జాబితా మీకు చాలా నిరాశ కలిగించినందుకు సారీ అండి.మా అమ్మ కూడా నేను నీకు చదవటం నేర్పించిన పుస్తకాలేమిటి, నువ్వు చదువుతున్నవేమిటి అని కలిసి నప్పుడల్లా కోపం చేస్తునేవుంటుంది:)నా దగ్గర వున్న పుస్తకాలు చూస్తుంటే ఆవిడకు వళ్ళు మండిపోతూవుంటుంది:)ఏమో నండి అలా అలావాటైపోయింది.

    ReplyDelete
  6. లాస్య గారు,
    నా ఇంటర్వ్యూ ప్రచురించినందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  7. mala garu meeru chala great .

    p.v.d.s .prakash garu yevari nanna.chala baga vrastharu

    ReplyDelete
    Replies
    1. శశికళ గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు. మా నాన్నగారి రచనలు మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete
    2. లాస్య గారు,
      స్వాతిలోని వాత్యాయన నేనూ చదువుతున్నాను. చాలా బాగుంది. నీరజ్ కారెక్టర్ చాలా నచ్చింది.

      Delete
  8. హేవిటో.. ఈ మాలాగారు.. అలా మనసు విప్పి అందంగా మాట్లాడొద్దండీ.. మీకు ఫాన్లు ఎక్కువైపోతారూ..తర్వాత నాలాంటివాళ్లం మీకు సెక్యూరిటీ అరేంజ్ చెయ్యలేం అంటే అర్ధం చేసుకోరూఊఊఊఊ....
    (మనలో మన మాట.. ఇంటర్వ్యూ చాలా బాగుంది.)

    ReplyDelete
    Replies
    1. శ్రీలలిత గారు ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

      Delete
    2. శ్రీలలిత గారు, థాంక్స్ అండి.

      Delete
  9. హేవిటో.. ఈ మాలాగారు.. అలా మనసు విప్పి అందంగా మాట్లాడొద్దండీ.. మీకు ఫాన్లు ఎక్కువైపోతారూ..తర్వాత నాలాంటివాళ్లం మీకు సెక్యూరిటీ అరేంజ్ చెయ్యలేం అంటే అర్ధం చేసుకోరూఊఊఊఊ....
    (మనలో మన మాట.. ఇంటర్వ్యూ చాలా బాగుంది.)

    ReplyDelete
  10. బాగుందండి

    ReplyDelete
  11. మాలా గారు ,
    మీరు అందంగా అన్నీ చెప్పేస్తే ఎంత బాగుందో ....

    ReplyDelete
  12. బాగుంది మాలాగారూ
    psmlakshmi

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...