బ్లాగు పేరు - skvramesh
రమేష్ గారి ఇంటర్వ్యూ
మీ పేరు
ఎస్ కె వి రమేష్
మీ ఉరు
గుడివాడ
స్వస్తలం
గుడివాడ
హాబీస్
ప్రయాణం చేయడం , చిన్న పిల్లలతో ఆడుకోవడం
మీ పుట్టిన రోజు
august 31 st
అభిమాన రచయిత
డా. సినారె గారు
నచ్చే రంగు
ఆరెంజ్
నచ్చే సినిమా
దేశభక్తి సినిమాలు ఏవైనా
ఇష్టమైన ఆహారం
పులిహోర
ఇష్టమైన పుస్తకం
గీతాంజలి
ఇష్టమైన ప్రదేశం
గుడివాడ
జీవితం అంటే
ఏకాంతంలో నైనా అందర్నీ దగర చేసుకుని ఆనందంగా ఉండడం
ఇతరులలో నచ్చేవి
నచ్చనివి అసలు వెతకను వెతికితే నాకు నేనే నచ్చను
సాహిత్యం తో మీ ప్రయాణం
అదో పిల్లకాలువలా మొదలైంది కాలమూ నా కలమే చూపాలి ముందున్న త్రోవ
మీ రోల్ మోడల్
నన్ను ఇంప్రెస్ చేసే వారందరూ
తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం
అందరి మనసుల్లో నిలబడేలా తెలుగులో అందమైన కవిత్వం రాయడం
రమేష్ గారి ఉగాది కవిత
విజయీభవ
నే తేబోతున్న తీపి చేదులకై తర్జన భర్జనలు పడుతూ
ఏమిటిలా పుట్టిన రోజు పండుగ చేస్తున్నావు నాకు
ఎగురుతూ ఆ కోయిలమ్మ అడుగు కదపకుండా ఈ పూలకొమ్మ
నాకు స్వాగతాలు పలుకుతుంటే,
క్షణం తీరికలేనితనం నాదంటూ సాగిపోయే నన్ను
నీ అనుభవాల్లో ఆపుకుంటావ్,
నీ అనుభూతులతో నా కడుపు నింపుతుంటావ్.
అందుకే స్వేచ్చగా నే, సాగుతూనే నీ సాహచర్యం కోసమని
ఇన్ని వన్నెలను దొర్లించుకుంటూ వస్తాను.
లెక్కగట్టి నా ఆద్యంతాలను తెలిపే నీ విజ్ఞానపు ఊయల్లో
ఆగక, నే సాగుతున్న బడలికను ఆరు ఋతువులుగా పోగొట్టుకుంటూ
నీ మంచి చెడులను నేను అలంకరించుకుంటాను.
నా పదాన నీకై జ్ఞాపకాల పూలు పూయిస్తానని,
వత్సరానికోపేరు పెట్టుకుని, వాత్సల్యంతో నన్ను పిలిచే నీకై
అంతా మంచే జరగాలన్న వాంఛతో
నీ వాకిలి లోకి 'విజయం' చేస్తున్నాను నేస్తం!
విజయీభవ అంటూ నిన్ను వరిస్తూ!
************
- లాస్య రామకృష్ణ
No comments:
Post a Comment