చదరంగం ఆటలో కిక్కు నాకిన్నాళ్ళు అర్ధం కాలేదు. ఒక సారి నేర్చుకున్నాక ఇక చదరంగం అట అపాలనిపించదు
ఈ
మధ్యనే నేని గేమ్ నేర్చుకున్నాను. సో ఈ అట బ్యాక్ గ్రౌండ్ గురించి
తెలుసుకొవాలనిపించిది. అఫ్ కోర్సు, చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదరంగం
గురించి ఒక లెస్సన్ ఉండేది. కానీ అప్పుడంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ ఒక
సారి గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక ఇది ఒక వ్యసనం ల మనల్ని వెంటాడుతుంది
(నన్ను). అంటే అంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందన్న మాట ఈ ఆట.
కాబట్టి సరదాగా ఈ ఆట గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
చదరంగానికి
1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశం లో నే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర
చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి
వ్యాప్తించింది. పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ
ఆటని తీసుకెళ్ళారు. వర్తమాన కాలంలో వాడుకలో ఉన్న చదరంగం ఆట పరిణామక్రమంలో
యూరోప్ లోని 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.

లాస్య రామకృష్ణ
No comments:
Post a Comment