Saturday 20 April 2013

లాస్య రామకృష్ణ తో లక్ష్మీ రాఘవ గారి మదిలో మాట



నా పేరు -డా. కే.వి లక్ష్మి 

కలం పేరు -లక్ష్మి రాఘవ 

బ్లాగు - బామ్మగారి మాట 

మావూరు - కురబలకోట . చిత్తూరు జిల్లా ...పెరిగినది, చదువు , ఉద్యోగం అంతా  హైదరాబాదు లో ..రిటైర్మెంట్  తరువాత వెనక్కి మళ్ళి పల్లె జీవితం !

పుట్టిన తేదీ - 09-01-1948

హాబీస్ --మొదటగా ఒక ఆర్టిస్ట్ నాలో అనేక రకాలుగా వ్యక్తమై, వ్యర్తపదార్ధాలతొ అనేక ఆకృతులు చేసి కలకత్తా నగరంలో కూడా ఎక్ష్జిబిశన్ చేయటం ఒక మంచి అనుభూతి . ఈ నాటికి ఏది చూసినా చెయ్యాలనే ఉత్చాహం ..painting-watercolours,oil. pencil sketching , carving chalkpieces, blok printing on sarees ,fabric painting ...i have tried every possible art!

అభిమాన రచయిత- యుద్దనపూడి సులోచనారాణి .

నచ్చేరంగు -- మెరూన్.

నచ్చేసినిమా - ఎప్పటికీ మాయాబజార్ 

ఇష్టమైన ఆహారం -వెజిటేరియన్ 

ఇష్టమైన పుస్తకం - సెక్రెటరీ

ఇష్టమైన ప్రదేశం --మా వూరు

జీవితం అంటే --ఒక అవకాశం సద్వినియోగ పరచుకోవడానికి ..

ఇతరులలో నచ్చేవి -- నన్ను కించ పరచని వారు  

సాహిత్యం లో నా ప్రయాణం ---మొదటి కథ వచ్చింది 1966 లో ఆంధ్రపత్రికలో....మద్యలో చాలా గ్యాప్ తరువాత ఈమధ్య రెగ్యులర్గా రాయగలుగుతున్నాను 

నా  రోల్ మోడల్ - మా శ్రీ వారు డా. కామకోటి రాఘవరావు గారు . నన్ను మార్చింది , మలిచింది అన్నీ ఆయనే. 

తెలుగు భాషకు నావంతు ప్రయత్నం -- కథలద్వారా , బ్లాగు ద్వారా తెలుగు భాషకు దగ్గర అవటమేకాకుండా ఉడతా భక్తిగా దోహదపడుతున్నననే తృప్తి !

బహుమతి పొందిన లక్ష్మీ రాఘవ గారి ఉగాది కవిత 

ఉగాది 2013



ఆనాడు,
కొత్త చిగుళ్ళను తింటూ కోయిల ‘కు హూ ‘అని కూస్తూ వుంటే
ఆవు పేడతో ఇంటి ముందు అలికి ,రంగవల్లులు దిద్ది ,
పచ్చని మామిడి తోరణాలు కట్టి ,ఇరువైపులా వేపమండలు అలంకరించి ,
ఆముదంతో నాన్నమ్మ తో తలంటి౦చుకుని స్నానాలు చేసి ,
కొత్త పరికిణి ల రేపరేపలతో ,చేతులనిండా కొత్తగాజులు గలగలా అంటుంటే మురిసి,
పుల్లమామిడి ,వేపపువ్వు ,కోతబెల్లం తో తయారైన ఉదాది పచ్చడిని ఆస్వాదిస్తూ ,
స్నేహితులతో చెమ్మచెక్క ఆడిన అలనాటి జ్ఞాపకాలు ఎన్నో.........

ఈనాడు ,
ఆడపిల్ల నిర్భయంగా బయటికి పోలేక,
బాంబు పేలుళ్ళ తో బెంబేలెత్తి ,
నలుగురు ఒక చోట నిలబడటానికి భయపడుతూ ,
అవినీతి ఉప్పొంగి జైళ్ళ ను నింపుతూ వుంటే ,
కుళ్ళు వాసన వేస్తున్న ఉగాది పచ్చడిని ఎలా ఆస్వాదిస్తాం ?
విజయ ఉగాది ని ఆనందంగా  ఎలా ఆహ్వానిస్తాం ???????



- లాస్య రామకృష్ణ 

2 comments:

  1. మరీ క్లుప్తంగా ఉంది . మనసులో మాటలని ఇంకా వెలుపలికి రప్పించి వారి అనుభవాలని అనుభూతులని చెప్పిస్తే బావుండేది అనిపించింది లక్ష్మీ రాఘవ గారు అభినందనలు . లాస్య రామకృష్ణ గారు మీ ప్రయత్నం చాలా బావుంది థాంక్ యు సో మచ్

    ReplyDelete
  2. లక్ష్మీరాఘవగారు మీ పరిచయం బాగుంది . అభినందనలు .

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...