Saturday 29 September 2012

ఉత్తమ టపా - 29th Sep 2012


నా మాట  

ఎన్నో సూర్యోదయాలు 
ఎన్నో సూర్యాస్తమయాలు 
ఎన్నో వెన్నెల రాత్రులు 
ఎన్నో అందమైన సాయంత్రాలు
బాల కార్మికుల జీవితాలలో మాత్రం మార్పు లేదు
వారికి విముక్తి ఎప్పుడు 
ఈ ప్రకృతిలోని అందాన్ని ఆనందించేది ఎప్పుడు 
బాల్యంలోని ఆనందాన్ని రుచిచుసేది ఎప్పుడు 

బాలకార్మికుల గురించి చట్టం ఉన్నా ఇంకా చాలా హోటల్స్ లో రకరకాల పారిశ్రామిక రంగాలలో బాలకార్మికులు తమ బాల్యాన్ని పణంగా పెడుతూనే ఉన్నారు. 
అటువంటి వారిని ప్రోత్సహించకుండా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

ఉత్తమ టపా :- ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా అంతరిక్షంలో నువ్వూ నేనూ. 

అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా ఒక సగటు మనిషికి కలిగే సందేహాలన్నీ నివృత్తి పరిచే పోస్ట్ ఇది. ఈ ఆర్టికల్ ని నాలుగు భాగాలుగా పోస్ట్ చేసారు. మంచు గారు మధురవాణి  గారు కలిసి రచించారు.అన్ని కోణాలనుంచి విశ్లేషించి చాలా బాగా రాసారు.

అంతరిక్షంలో నువ్వూ నేనూ
లంకె

 
మధురవాణి గారికి, మంచుగారికి అభినందనలు.

ఈ టపాని ఉత్తమ టపా గా సజెస్ట్ చేసిన భాస్కర్(the tree) గారికి ధన్యవాదములు.

మంచి మాట :- ప్రార్ధించే పెదవుల కన్నా  చేసే చేతులు మిన్న.




- లాస్య రామకృష్ణ 


1 comment:

  1. ఉత్తమ టపా సూచించేవారు తమ పేరు చెప్పదలచుకుంటే కామెంట్ లో మీకు నచ్చిన టపా గురించి తెలియచేయండి. ఒకవేళ, తమ పేరు తెలియచేయకుండా ఉండాలంటే lasyaramakrishna@gmail.com కి మెయిల్ చెయ్యండి. ధన్యవాదములు.

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...