Friday, 20 September 2013
Thursday, 15 August 2013
Friday, 2 August 2013
లాస్య రామకృష్ణ తో నిమ్మగడ్డ చంద్రశేఖర్ గారి ఇంటర్వ్యూ
బ్లాగు - వృత్తాంతి
బ్లాగు లంకె - http://vruttanti.blogspot.in
మీ పేరు
నిమ్మగడ్డ చంద్ర శేఖర్
మీ ఊరు
2004 నుండి బెంగళూరులో నివాసం; 4 సంవత్సరాలు చెన్నైలో 5 సంవత్సరాలు మహారాష్ట్రలొ, అంతకు ముందు హైదరాబాదులొ వుద్యోగం
స్వస్థలం
మాది ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దైవాలరావూరు గ్రామం
హాబీస్
ప్రతి రోజూ కనీసం 4 దిన పత్రికలు చదవడం, వారానికొక మంచి పద్యం బట్టీ కొట్టడం
పుట్టిన రోజు
జున్ 12
అభిమాన రచయిత
చెప్పడం చాలా కష్టం. కవి సామ్రాట్ విశ్వనాథ గారి పుస్తకాల మీద కుస్తీ పడుతూ అస్వాదిస్తున్నాను.
నచ్చే రంగు
తెలుపు రంగు
నచ్చే సినిమా
ముత్యాల ముగ్గు
ఇష్టమైన ఆహారం
బాపట్ల ప్రాంతంలొ దొరికే వంకాయతో కూర, దోసకాయ పప్పు
ఇష్టమైన పుస్తకం
మను చరిత్ర - కనీసం 10 సార్లు చదివాను. సుమారు 30 పద్యాలు, వచనం నోటికి వచ్చు
ఇష్టమైన ప్రదేశం
శ్రింగేరి - నన్ను నేను మర్చిపోయి, శారదా దేవి ఆలయంలో నిలబడి బమ్మెర పోతన భాగవతం నుంచి "క్షోణి తలంబు నున్నుదుట సొకగ మ్రొక్కి నుతింతు" అనే పద్యాన్ని పాడుకుంటూ ఆనందిస్తా
జీవితం అంటే
మానవ జీవితం చాలా చిన్నది. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించకు, పరిష్కారం వున్న సమస్యకు ఎట్లైనా సమాధానం దొరుకుతుంది కాబట్టి, అదే విషయాన్ని తీవ్రంగా ఆలొచించి వత్తిడికి గురి కావడం అనవసరం. ఆది శంకరుడు చెప్పినట్లు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. మనకున్నదాంతో త్రుప్తి పడి, కష్తాల్లొ వున్న వ్యక్తికి సాయం చేస్తే, అదే మనకు శ్రీరామ రక్ష.
ఇతరులలో నచ్చేవి
కొంత మంది వాక్చాతుర్యం; తెలివితేటలు
సాహిత్యం తో మీ ప్రయాణం
కేవలం పద్యం బ్రతికితేనే మన భాష బ్రతికేది అని కొంతమంది పెద్దల పరిచయం వలన తెలుసుకున్నాను. 5వ తరగతి నుండి 10 వ తరగతి వరకు వున్న తెలుగు పుస్తకాలను కొని భాష మీద పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. పంచ కావ్యాలను సరళమైన పుస్తకాల ద్వారా ఆకళింపు చేసుకుంటున్నాను. పింగళి సూరన విరచిత కళా పూర్ణోదయం చదివిన తరువాత, ఒక పద్యం పై నుంచి కిందకు ఒకలా, కింద నుంది పైకి చదివితే మరోలా అర్ధం - ఇలాంటి విషయాలు తెలియని తెలుగు వాళ్ళు ఎంత కోల్పోతున్నారో అని ఆలోచిస్తా.
మీ రోల్ మోడల్
అబ్దుల్ కలాం
తెలుగు భాషకు మీ ప్రయత్నం
నా సహాద్యాయుడు మిత్రుదు లక్ష్మీ రెడ్డి గారి ఆర్ధిక సహకారంతో, తెలుగు భాషపై మమకారం కలిగించేలా సహస్రావధాని డా|| గరికిపాటి గారి ఉపన్యాసం బెంగలూరులో ఏర్పాటు చేశాము. ఒంగోలులో జిల్లా వ్యాప్త పద్య ధారణ పోటీలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు గరికిపాటి గారిచే తెలుగు భాష గొప్పదనం తెలిపాము. సి పి బ్రౌన్ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా స్థానిక తెలుగు మాధ్యమ ఏకోపాధ్యాయ పాఠశాలల పిల్లలను కలిసి ప్రొత్సహించాము. జాతీయ స్థాయి పద్య, నాటక మరియు గేయ పోటీలు నిర్వహించాము (అనివార్య కారణాల వలన ఇంకా ఫలితాలు ప్రకటించలేదు).
వృత్తి జీవితం
నేను బి కాం; పిజిడిఎం ఎం ; పిజిడిపిఎ; ఎంబిఎ చదువుకున్నాను. ఢిల్లీ కేంద్రంగా నెలకొల్పిన పెద్ద ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలో డి జి ఎం -మార్కెటింగ్ (దక్షిణ జొన్) గా పనిచేస్తున్నాను.
లాస్య రామకృష్ణ
Sunday, 21 July 2013
లాస్య రామకృష్ణ తో శశికళ గారి ఇంటర్వ్యూ
బ్లాగు - ఇది శశి ప్రపంచం
బ్లాగు లంకె - http://itissasiworld.blogspot.in
పేరు
శశి కళ వాయుగుండ్ల
ఊరు
నెల్లూరు జిల్లాలో చిన్న పల్లె
హాబీస్
బుక్ రీడింగ్ , సినిమాలు
పుట్టిన రోజు
మే పన్నెండు
అభిమాన రచయిత
మల్లాది , దాశరది రంగా చార్య
నచ్చే రంగు
తెలుపు
నచ్చే సినిమా
రోజా
ఇష్టమైన ఆహారం
ఏవైనా పర్లేదు వెజ్ మాత్రమే
ఇష్టమైన పుస్తకం
రైలు బడి
ఇష్టమైన ప్రదేశం
మా ఊరు ,తిరుమల
జీవితం అంటే
ఎన్నో అనుభవాలు పొందడం కోసం మనం వేసే ఒక నాటకం
ఇతరులలో నచ్చేవి
నిస్వార్ధమైన స్నేహం,ఆప్యాయంగా మాట్లాడే మాటలు
సాహిత్యం తో మీ ప్రయాణం
రెండు కవిత సంకలనాలు వెలువర్చాను. (జాబిలి తుణకలు, స్వర్ణ ముఖీ సవ్వడులు నానీల సంకలనం) ఇప్పుడు బ్లాగ్ మరియు ప్రస్తుతం కధలు వ్రాస్తున్నాను

మీ రోల్ మోడల్
వివేకానంద ,అబ్దుల్ కలాం
తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
మా బడి లో పిల్లలకు కధలు, కవితలు వినిపిస్తూ వారి చేత కూడా వ్రాయిస్తూ ఉంటాను
- లాస్య రామకృష్ణ
Tuesday, 16 July 2013
కందిశంకరయ్యగారు మరియు శృతిగారు అడిగిన ప్రశ్నకి సమాధానం
బ్లాగ్ లో కాపీ పేస్టు ఆప్షన్ డిసేబుల్ చెయ్యడం వలన కలిగే లాభాలేమిటి. చెయ్యకపోతే నష్టమేమిటి.
బ్లాగ్ లో ఎంతో కష్టపడి విలువైన సమాచారం మనం పొందుపరుస్తాము. అటువంటి సమాచారాన్ని ఎవరైనా ఈజీ గా కాపీ చేసి వాళ్ళ వెబ్సైటులలో కానీ బ్లాగులలో కానీ పేస్టు చేసుకునే అవకాశం కలదు.
బ్లాగ్ లో ని సమాచారాన్ని సులభంగా తస్కరించకుండా ఉండేందుకు కాపీ పేస్టు ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యవచ్చు.
Monday, 15 July 2013
కాపీ పేస్టు ఆప్షన్ ని ఈ విధం గా బ్లాగులో డిసేబుల్ చెయ్యవచ్చు.
నాకు తెలిసిన ఈ సమాచారాన్ని బ్లాగు మిత్రులతో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను
1. మొదటగా Blogger లో కి లాగిన్ అయ్యి మీ బ్లాగ్ ని సెలెక్ట్ చేసుకోండి
2. లేఔట్(Layout) లో ని Add a Gadget ని click చేసి HTML/JAVASCRIPT ని select చేసుకోండి.
3. ఇప్పుడు ఈ క్రింద కోడ్ ని ఆ గాడ్జెట్ లో కాపీ చేసి సేవ్ చెయ్యండి.
<!--Disable Copy And Paste-->
<script language='JavaScript1.2'>
function disableselect(e){
return false
}
function reEnable(){
return true
}
document.onselectstart=new Function ("return false")
if (window.sidebar){
document.onmousedown=disableselect
document.onclick=reEnable
}
</script>
4. ఇప్పుడు మీ బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి.
- లాస్య రామకృష్ణ
1. మొదటగా Blogger లో కి లాగిన్ అయ్యి మీ బ్లాగ్ ని సెలెక్ట్ చేసుకోండి
2. లేఔట్(Layout) లో ని Add a Gadget ని click చేసి HTML/JAVASCRIPT ని select చేసుకోండి.
3. ఇప్పుడు ఈ క్రింద కోడ్ ని ఆ గాడ్జెట్ లో కాపీ చేసి సేవ్ చెయ్యండి.
<!--Disable Copy And Paste-->
<script language='JavaScript1.2'>
function disableselect(e){
return false
}
function reEnable(){
return true
}
document.onselectstart=new Function ("return false")
if (window.sidebar){
document.onmousedown=disableselect
document.onclick=reEnable
}
</script>
4. ఇప్పుడు మీ బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి.
- లాస్య రామకృష్ణ
Thursday, 11 July 2013
లాస్య రామకృష్ణ తో మాలా కుమార్ గారి ఇంటర్వ్యూ
బ్లాగు - సాహితి
ఇతర బ్లాగులు
పేరు
మాలాకుమార్(అసలు పేరు కమల అనుకోండి , మాల గా మారిపోయి అదే చలామణి అవుతోంది:))
మీ ఉరు
హైదరాబాద్
స్వస్తలం
అంటే పుట్టింటివారిది నందిగామ , అత్తింటివారిది ఖమ్మం . కాని ఈ రెండు చోట్లకు అప్పుడప్పుడు బంధువులను కలిసేందుకు వెళ్ళిరావటం తప్ప ఎప్పుడూ వుండలేదు.
హాబీస్
చాలా వున్నాయి:)ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే వుంటాను.కాని ముఖ్యమైనది నవలలు చదవటం.
పుట్టినరోజు
25 జులై
అభిమాన రచయిత
చాలా మంది వున్నారు . యద్దనపూడి సులోచనారాణి, పొత్తూరి విజయలక్ష్మి, మల్లాది , ఆనందారామం, కావలిపాటి విజయలక్ష్మి, చిట్టారెడ్డి సూర్యకుమారి, మాదిరెడ్డి సులోచన అబ్బో ఇలా చాలా మంది వున్నారు.
నచ్చేరంగు
లేత రంగులు , తెలుపు , లేత గులాబి
నచ్చే సినిమా
కొట్టుకోవటాలు , రక్తపాతాలు లేని ఏవైనా చక్కని కుటుంబకథా చిత్రాలు, వెకిలి హాస్యం లేని హాస్య చిత్రాలు నచ్చుతాయి.కొంచం మూడ్ బాగాలేనప్పుడల్లా పాత మిస్సమ్మ చూస్తుంటాను:
ఇష్టమైన ఆహారం
మసాలాలు లేని ఏదైనా శాఖాహారం
ఇష్టమైన పుస్తకం
ఏవైనా చాలా లైట్ గా వుండేవి,ముఖ్యం గా హాస్య పుస్తకాలు ఇష్టం. ఈ మధ్య చదివినవాటిల్లో నచ్చింది, మల్లాది "సద్దాం ఆంటీ ఇంటి కథ."
ఇష్టమైన ప్రదేశం
డార్జిలింగ్, హిమాలయాలు . ఎప్పటికైనా హిమాలయాలలో స్తిరపడాలని నా చిరకాల కోరిక
జీవితం అంటే
కష్టసుఖాల కలనేత చీర
ఇతరులలో నచ్చేవి
మృదు సంభాషణ
సాహిత్యం తో మీ ప్రయాణం
మా పుట్టింట్లో అందరూ కొద్దో గొప్పో సాహిత్యం అంటే అభిమానం వున్నవారే. మా మామయ్యలు, అమ్మా , పిన్నీ కలిసి నప్పుడల్లా సాహిత్య చర్చలు జరుగుతూవుంటాయి. నా చిన్నప్పుడే మా అమ్మ, కళాపూర్ణోదయం , ఆరుద్ర సమగ్ర ఆంధ్ర చరిత్ర , బారిస్టర్ పార్వతీశం , గణపతి, బుడుగు,టాంసాయర్ లాంటి పుస్తకాలు చాలా చదివించింది.అలా చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు. 2008 లో బ్లాగ్” సాహితి” మొదలుపెట్టి నప్పటి నుంచి ఏదో వ్రాయటం అలవాటైంది.
మీ రోల్ మోడల్
మా అత్తగారు.
తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
తెలుగులో వ్రాయటం, తెలుగు చదవటం,మనవళ్ళకూ మనవరాళ్ళకు తెలుగు నేర్పించి, తెలుగు కథలు చెప్పటమే :)
- లాస్య రామకృష్ణ
Subscribe to:
Posts (Atom)
రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...

-
పేరు: - "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాక...
-
మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...
-
కూడలి సెలవు తీసుకుంటోంది. తెలుగు బ్లాగ్ లోకానికి అత్యంత సేవ చేసిన కూడలి ఈ నిర్ణయానికి రావడం బాధాకరం. వియ్ మిస్ యూ కూడలి ...