Wednesday, 27 February 2013

అధర్మిక ప్రచారాలను, ధర్మద్వేషుల విషప్రచారాలను అడ్డుకోవటం లక్ష్యం

బ్లాగ్ పేరు - హరి సేవ 

బ్లాగ్ రచయిత - దుర్గేశ్వర 

బ్లాగ్ పరిచయం రచయిత మాటల్లో 


"దైవభక్తి, దేశభక్తి పెంపొందించటం 

సనాతన ఋషులు తెలిపిన సాంప్రదాయానుసారం భగవత్సాధన మార్గములలో పాల్గొనేలా కార్యక్రమములు నిర్వహించటం 


అధర్మిక ప్రచారాలను, ధర్మద్వేషుల విషప్రచారాలను అడ్డుకోవటం లక్ష్యం" అని హరిసేవ బ్లాగ్ నిర్వాహకులు దుర్గేశ్వర గారు తెలుపుతున్నారు. 



- లాస్య రామకృష్ణ 


Monday, 11 February 2013

ఇప్పటికి 307 రచనలు చేసాను


బ్లాగు రచయిత - బి వి డి ప్రసాదరావు


బ్లాగు పరిచయం రచయిత మాటల్లో 

"తెలుగు పుస్తకాలు బాగా చదువుతాను. చిన్న కథలు అంటే భలే మక్కువ. రచనలు చేస్తాను. ఇప్పటికి 307  రచనలు  చేసాను. అన్నీ ముద్రితం. కొన్నింటికి బహుమతులు పొందాను. రచనల పరంగా నా కలం పేర్లు : బి.వి.డి.ప్రసాదరావు, అన్వేషి, బత్తుల వి. దుర్గా ప్రసాదరావు, బి.వి.డి., స్నేహ ప్రసాద్, బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు, బి.వి.దుర్గా ప్రసాదరావు. నా మొదటి రచన (పేద బ్రతుకులు - కథ) 31 జనవరి 1975 లో ప్రగతి వార పత్రికలో అచ్చు అయ్యింది.

సమయానుకూలంగా నా బ్లాగ్ ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను; మీతో ముచ్చటిస్తూ ఉంటాను ...  నా స్వ విషయాలే కావచ్చు; నా అనుభవాలే కావచ్చు; ఐనా మీకు, అందరికి ఆమోద యోగ్యంగా/ అవసరమన్నట్టుగా నా కబురులు  ను ఇకపై  అందిస్తుంటాను."

- లాస్య రామకృష్ణ 

Tuesday, 29 January 2013

నేను బ్లాగ్ రాయడానికి ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్


బ్లాగ్ పేరు - కేఫ్ అడ్డా

రచయిత - వజ్ర దీప్ 

రచయిత మాటల్లో ఈ బ్లాగ్ గురించి 

"నేను బ్లాగ్ రాయడానికి  ఆమిర్ ఖాన్ ఇన్స్పిరేషన్. తన బ్లాగ్ ని regularగా  చదివే వాడిని . నేను కేఫ్ లో స్నేహితులతో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడే విషయాలు సినిమాలు, రాజకీయాలు,సామాజిక విషయాలు etc. చాలా మంది వాళ్ళ వాళ్ళ అడ్డాలో మాట్లాడే విషయాలు   mostly ఇవే. సో అలా పుట్టిందే ఈ నా కేఫ్ అడ్డా."


బ్లాగ్  ప్రత్యేకతలు 

సినిమా సమీక్షలు , మంచి సినిమాల గురించి (అంటే నాకు నచ్చిన సినిమాలు)  అందరికి తెలియజేయడం ( Awareness to  పీపుల్ who don't know), Inspirational  stuff, Social  Awareness /Causes , మంచి విషయాలు etc 

మరి ఈ వినూత్నమైన బ్లాగ్ ని చదివి వజ్ర దీప్ కి మన అభిప్రాయాలు తెలుపుదామా...




- లాస్య రామకృష్ణ 


Monday, 28 January 2013

మీ బ్లాగు ఏ కోవలోకి వస్తుంది


ఎన్నో తెలుగు బ్లాగులు 

ఎన్నో అందమైన బ్లాగులు 

ఎన్నో తెలుగు రుచి చూపించే బ్లాగులు 

ఎన్నో మదిని దోచే బ్లాగులు 

ఎన్నో సంగిత బ్లాగులు 

ఎన్నో ఘుమ ఘుమల బ్లాగులు 

ఎన్నో జ్ఞాపకాల బ్లాగులు 

ఎన్నో సాహిత్య బ్లాగులు 

ఎన్నో సాంకేతిక విజ్ఞాన బ్లాగులు 

ఇలా ఎన్నో ఎన్నెన్నో బ్లాగుల ప్రత్యేకతలు 


మరి మీ బ్లాగు ఏ కోవలోకి వస్తుంది. మీ బ్లాగు ప్రత్యేకతల ను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం మీ బ్లాగుల గురించి"ఈ శిర్షిక మీదే" లో  బ్లాగ్ లోకం లో పరిచయం చెయ్యాలనుకునే వారుlasyaramakrishna@gmail.com కి మీ బ్లాగ్ లింక్ తో పాటు మీ బ్లాగ్ యొక్క ప్రత్యేకతలని అలాగే బ్లాగులతో మీ అనుబంధాన్ని, బ్లాగు ప్రయాణాన్ని, జ్ఞాపకాలని మాకు ఈమెయిలు చెయ్యండి. వీలయితే మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో  ని కూడా జతపరచండి. 

- లాస్య రామకృష్ణ 

Sunday, 27 January 2013

తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం


బ్లాగు -  సుజన-సృజన

బ్లాగు రచయిత - వెంకట రాజారావు లక్కాకుల

బ్లాగు పరిచయం రచయిత మాటల్లో 







"నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రథానోపాథ్యాయులుగా పని చేసి రిటైరయ్యాను . నా బ్లాగులో పాఠశాల విద్యా పరమైన వ్యాసాలు , కథలు , చూడవచ్చు. తెలుగు భాషకు ప్రత్యేక మైన తెలుగు పద్యమంటే నాకిష్టం .
అందు వల్ల తెలుగు పద్య మెంత టేస్టో నా బ్లాగులో రుచి చూడ వచ్చు .
మథుర మైన గ్రామీణ తెలుగంటే నాకిష్టం . గ్రామీణ తెలుగును గ్రామ్యమని
ఈసడించే పండితుల దురహంకారమంటే కష్టం."

- లాస్య రామకృష్ణ 

Saturday, 26 January 2013

అందరికీ


గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

- లాస్య రామకృష్ణ 

Wednesday, 23 January 2013

"అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం"

రచయిత్రి - శ్రుతి రుద్రాక్ష్ 
పరిచయం రచయిత్రి మాటల్లోనే 

"నా పేరు. శృతి. అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నేను సంతోషంగా ఉంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే చిలిపి అమ్మాయిని. నా వాళ్ళ నవ్వు లో నా సంతోషం దాగి వుంది. తెలుగు భావాలను సంప్రదాయాలను ఇష్టపడే అందమైన తెలుగు అమ్మాయిని. రండి నా బ్లాగు ని చూద్దాం..."

ఇంకెందుకాలస్యం ఈ బ్లాగ్ ని చదివి తెలుగమ్మాయిని మనసారా అభినందిద్దామా.

- లాస్య రామకృష్ణ 


రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...