Saturday 15 September 2012

ఈ వారం ఉత్తమ టపా ప్రారంభోత్సవం

నమస్కారం అండీ, 

దాదాపు వారం కావస్తోంది. ఎంత త్వరగా గడిచిపోతున్నాయి రోజులు. కాని ఈ వారంలో ఎన్నో మార్పులు జరిగాయి. అటు రాజకీయపరంగా కాని, సినిమాపరంగా కాని.
ఇప్పుడు విషయం లోకి వస్తే, బ్లాగు ప్రపంచంలో మనల్ని ఎన్నో బ్లాగులు అకట్టుకుంటాయి. కొన్ని బ్లాగులు అలోచింపచెస్తే, కొన్ని బ్లాగులు సరదాగా నవ్విస్తాయి, మరికొన్ని బ్లాగులు సంగీతం లో ఊయలలూగిస్తాయి.
తనదైన ప్రత్యేక శైలిని అలవరించుకొని బాబాయిగారు, తాతగారు అని పిలిపించుకుంటూ మన కుటుంబంలొని వ్యక్తిలా ఎన్నో పురణగాధలను తెలియచెస్తూ, అప్పుడప్పుడూ తన జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్న కష్టేఫలి గారితో మన శిర్షిక " ఈ వారం ఉత్తమ టపా" ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

లంకె -  శర్మ కాలక్షేపంకబుర్లు-ఆనందం

ఆనందం అనే ఈ టపా లో కష్టేఫలి గారు, ఆనందం అనే మాటని చాలా బాగా విశ్లేషించారు."వేదాంతంలో నిత్యమైనది ఆనందం. ఒక క్షణం ఉండి మరొక క్షణం లో పోయేది కాదు. నిత్యమైన ఆనందం (మన రంజిత నిత్యానందుడు కాదు)ఎప్పుడూ ఉండేది అదే నిత్యానందం బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మ, అదే దైవం." అని ఆనందం గురించి వివరించారు.శర్మ గారి టపాలన్నీ ఆణిముత్యాలే. ఆ అణిముత్యాల్లోంచి మరొకసారి చదువుకుందామని ఈ ఆణిముత్యం లింక్ ఇచ్చాను.

- లాస్య రామకృష్ణ 

 



7 comments:

  1. మంచి ప్రయత్నం, తాత గారికి అభినందనలు.

    ReplyDelete
  2. లాస్య రామకృష్ణ గారు,
    నా బ్లాగును మీరు ఆదరించడమేకాక మొదటగా నా టపాను ఎంపికచేసినందుకు "ఆనందం". మీ ఈ ప్రయత్నం అవిఛ్ఛిన్నంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, ఆశీర్వదిస్తూ, సర్వేజనాః సుఖినో భవంతు.

    ReplyDelete
  3. అధ్భుతమైన ఆలోచన లాస్య గారు :)

    ReplyDelete
  4. మీ ఆలోచన బావుంది లాస్య గారు. బాబాయి గారికి అభినందనలు.

    ReplyDelete

  5. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

    ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...