ఉత్తమ టపా - 22nd Sep 2012


నా మాట :-

ఇల్లాలికి వేతనం అనే అంశంపై ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం పై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లాలికి వేతనం ఇచ్చి పనిమనిషి గా ఆమె శ్రమకి వెల కడతారా అని కొందరి అభిప్రాయమైతే, ఇల్లాలి శ్రమని ఈ విధంగానైనా గుర్తిస్తున్నారు. గృహ హింస తగ్గే అవకాశాలున్నాయి అని కొందరి అభిప్రాయం. 

ఇరవై నాలుగు గంటలూ తన వారి కోసం శ్రమ పడిన ఇల్లాలికి కొంచెం నలతగా ఉంటే కనీసం ఎలా ఉన్నావు అని పట్టించుకోని ఘనులున్న సమాజంలో ప్రభుత్వం వారి ఆలోచన కొంచెం ఆశాజనకంగా ఉంది. 

ఇంట్లో పట్టెడు అన్నం మాత్రమే ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరికీ పంచి తను మాత్రం పస్తులు ఉంటుంది. 

"ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు"  అని చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే చదువుకున్న ఇల్లాలు ఇంటి కి సంబంధించిన నిర్ణయాలు చక్కగా అలోచించి తీసుకుంటుంది, ఆరోగ్యవంతంగా ఇంటిని, ఇంట్లోని సభ్యులని ఉంచుతుందని.

అదే విధంగా ఇల్లాలికి ఆర్ధిక స్వాతంత్రం కూడా ముఖ్యం. ఇంకా ఈ సమాజంలో "Gender discrimination" (లింగ వివక్ష) అన్నది అంతర్లీనంగా ఉంది. తమకంటూ డబ్బుని స్వతంత్రంగా ఖర్చు పెట్టే కనీస అర్హత కూడా లేదు.

తన హక్కు కోసం తనూ పోరాడే రోజు, తన గురించి తనూ శ్రద్ద తీసుకునే రోజు రావాలని కోరుకుందాం. ఎందుకంటే, "ఇల్లాలి అర్యోగ్యం ఇంటికి ఆరోగ్యం కాబట్టి".

ఇల్లాలిని సముచితంగా చూస్తూ గౌరవించే చూసే భర్తలూ  ఉన్నారు.  అటువంటి వారికి హాట్సాఫ్.

ఉత్తమ టపా :-

ఈ వారం ఉత్తమ టపా లో చోటు చేసుకున్న టపా "ధ్యానం - నీ లోనికి నీ పయనం". స్మరణ అనే బ్లాగు లోంచి తీసుకోబడినది. రచయిత్రి భారతి గారు. 

భారతి గారు ఆధ్యాత్మిక విషయాలని పామరులకు సైతం అర్ధం అయ్యే రీతిలో ఈ బ్లాగుని తీర్చిదిద్దారు.  

ఈ వారం ఉత్తమ టపా లంకె - "ధ్యానం - నీ లోనికి నీ పయనం",

మంచి మాట : -

 "సత్యానికి అప్పుడప్పుడూ గ్రహణం పడుతుంది గాని పూర్తిగా అదృశ్యం కాదు."


 - లాస్య రామకృష్ణ 



Comments

 1. భారతిగారికి అభినందనలు.

  ReplyDelete
 2. లాస్య రామకృష్ణ గారు,
  "బ్లాగ్ లోకం" లో నా బ్లాగు 'స్మరణ'కు స్థానమిచ్చి ఆదరించడమే కాకుండా ఈ వారం ఉత్తమ టపా గా ధ్యానం - నీలోనికి నీ పయనం అనే నా టపాను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలండి.

  అభినందనలు తెలిపిన కష్టేఫలే శర్మగార్కి ధన్యవాదాలు.

  ReplyDelete
 3. "స్మరణ" భారతి గారికి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సర్

   Delete
 4. భారతిగారికి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి భాస్కర్ గారు!

   Delete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.