Tuesday, 30 October 2012

బ్లాగ్ లోకం లో కొత్త శీర్షిక ప్రారంభం


మీ ఆదరాభిమానాలను అతి తక్కువ కాలం లో గెలుచుకున్న బ్లాగ్ లోకం ఒక కొత్త శిర్షిక తో మీ ముందుకు రాబోతోంది 


మరిన్ని వివరాలు త్వరలో ....



- లాస్య రామకృష్ణ 

Saturday, 27 October 2012

ఉత్తమ టపా - 27th Oct, 2012

ఉత్తమ టపా :-

పెయింటింగ్స్ లో, కవితలలో తనదైన ప్రతిభ చూపిస్తూ ఒక సారి చదివిన ఏ బ్లాగర్ కై  ఖచ్చితంగా బ్లాగ్ మొత్తం చదివి తీరాలి అనిపించేలా అందంగా తీర్చిదిద్దబడిన ముచటైన బ్లాగ్ "పద్మార్పిత".

 ఈ వారం ఉత్తమ టపాలో చోటు చేసుకున్న టపా పద్మార్పిత గారు రచించిన "నా వయసెంత". స్త్రీ ఔన్నత్యాన్ని ఏంతో సున్నితంగా వివరించారు రచయిత్రి పద్మార్పిత గారు.

ఉత్తమ టపా లంకె - "నా వయసెంత".

పద్మార్పిత గారికి అభినందనలు.

తన బ్లాగ్ లో మెంబర్స్ వంద మందికి చేరినందుకు బ్లాగ్ముఖంగా అభినందనలు బ్లాగర్స్ అందరి తరపునా తెలియచేస్తున్నాను.

మంచిమాట: - సత్యం మహోన్నత మానవుడి లక్ష్యం.

- లాస్య రామకృష్ణ 


Thursday, 25 October 2012

బ్లాగులోకంలో వంద బ్లాగులు చోటుచేసుకున్నాయోచ్.....


నాకు తెలిసిన మంచి బ్లాగులన్నిటిని ఒక చోటికి చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా బ్లాగులోకం అనే బ్లాగ్ ని తిర్చిదిద్దాను.

ఆ ప్రయత్నంలో భాగంగా బ్లాగ్లోకంలోకి వంద బ్లాగులు చోటు చేసుకున్నాయి. ఇంకా మరిన్ని మంచి బ్లాగులు బ్లాగులోకం లోకి అడుగిడబోతున్నాయి.

ఈ సందర్భంగా నాకు మెయిల్ ద్వారా మంచి బ్లాగుల గురించి తెలియచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.


- లాస్య రామకృష్ణ 

Tuesday, 23 October 2012

బ్లాగ్ లో ని టపాలను పిడియఫ్ (PDF) రూపంలో Convert చేసుకోవాలనుకునేవాళ్ళకి శుభవార్త.

నాకు తెలిసిన విషయాన్ని నా లాంటి బ్లాగర్స్ కి ఉపయోగపడుతుందని పంచుకుంటున్నాను.  

బ్లాగు లోకం ఎంత పెద్దది. ఎంత విశాలమైనది.

ఎందరో బ్లాగర్స్. పత్రికలో రాసే రచయితలకంటే గొప్ప టాలెంట్ ఉన్న బ్లాగర్స్ సరైన అవకాశం లేక బ్లాగ్ లోనే పోస్ట్ చేసుకుంటున్నారు 
ఎన్నో టపాలను రాస్తాం. అయితే వాటిని అంతర్జాలం సహకరిస్తేనే మనం చూసుకోగలుగుతాం. మరి టపాలని PDF రూపంలో మార్చుకోగలిగితే. 

బ్లాగ్ లో ని టపాలను పిడియఫ్ (PDF) రూపంలో Convert చేసుకోవాలనుకునేవాళ్ళకి శుభవార్త.

వాటిని ప్రింట్ తీసుకోవచ్చు. నచ్చినప్పుడల్లా చదువుకోవచ్చు, అంతర్జాలం ఉపయోగించడం తెలియని వాళ్లకి కూడా చదవడానికి ఇవ్వవచ్చు. 

ఈ మధ్యనే నాకీ విషయం తెలిసి చాలా సంతోషించాను.

వివరాలకు, blogspdf@gmail.com కి మెయిల్ చెయ్యండి. 


                                                    
సేకరణ 
లాస్య రామకృష్ణ 

Saturday, 20 October 2012

నవరాత్రి బ్లాగోత్సవాలలో అయిదవ రోజు


నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం సుస్వాగతం 

నవరాత్రి బ్లాగోత్సవాల సందర్భంగా బ్లాగ్ లోకంలో ఈ రోజు చోటు చేసుకున్న బ్లాగ్ గురించి తెలుసుకుందాం.

కుట్లు అల్లికలు, రక రకాల రంగవల్లులతో మనందరికీ స్వాగతం పలుకుతోంది "సఖియా వివరించవే' బ్లాగ్. 

చాలా సులభమైన చిట్కాలతో కుట్లు అల్లికల గురించి వివరించారు బ్లాగర్ "అనామిక" గారు.

మరి నేర్చేసుకుందామా!!!

- లాస్య రామకృష్ణ 




Friday, 19 October 2012

నవరాత్రి బ్లాగోత్సవాలలో నాలుగవ రోజు

నమస్కారం, 

నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం, సుస్వాగతం.

నవరాత్రి బ్లాగోత్సవాలలో చోటు చేసుకున్న బ్లాగ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా!!!

చదివేయండి మరి.

చక్కని కవితలతో మనసు సేదతీరాలంటే ఖచ్చితంగా ఈ బ్లాగ్ ని వీక్షించాలి.

బ్లాగ్ లంకె - లిఖిత 

- లాస్య రామకృష్ణ 

Thursday, 18 October 2012

నవరాత్రి బ్లాగోత్సవాలలో మూడవ రోజు

నవరాత్రి బ్లాగోత్సవాలకి స్వాగతం సుస్వాగతం...

మనం ప్రతి రోజు ఒక బ్లాగ్ గురించి నవరాత్రుల సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. 

ఇవాల్టి బ్లాగ్ గురించి తెలుసుకుందామా మరి!

కాలక్షేపం కోసం ఏదైనా కథ చదవాలనుకుంటున్నారా? అయితే మీ నిరీక్షణ ఫలించినట్టే.
  
చక్కటి కథలు, కవితలు ఇంకా ఎన్నో కబుర్లు, మనందరి కోసం తన బ్లాగ్ లో భద్రపరచిన బ్లాగర్ గారు ప్రముఖ రచయిత బి వి డి ప్రసాదరావుగారు.


బ్లాగ్ ఓపెన్ చెయ్యగానే ఎన్నో కథలు, కవితలు మనకి స్వాగతం పలుకుతాయి.

సో ఇంకెందుకాలస్యం, చదివేయండి మరి.

 

- లాస్య రామకృష్ణ 



రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...