Wednesday, 4 November 2015

టూకీగా సినిమా కబుర్లు - లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్


  లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్ 
 అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాహుబలి 2 లో రానాకు జోడీగా ఎంపికైంది. మొత్తానికి రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసినందుకు సంతోషంతో  ఉబ్బితబ్బిబ్బవుతోంది లావణ్య. 


కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్ 
పలువురు రచయితలు, సినీ ప్రముఖులు జాతీయ అవార్డులను వెనక్కు  ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యక్తపరిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. 



దీపావళికి 'అఖిల్'
అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్' చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 




Saturday, 7 March 2015

అందం



జీవితమనే నాటకంలో 
వర్ణాలు ఎన్నో 
ప్రతి వర్ణానికి దేనికదే ప్రత్యేకత 
కష్టమనే నలుపు లేకపోతే 
సుఖమనే తెలుపు విలువ తెలియదు 
కష్ట సుఖాల మధ్యనున్నవి మిగతా రంగులు 
అన్ని రంగుల కలయిక జీవితం 

ప్రతి చోటా అందమే 
సూర్యోదయం అందం 
సూర్యాస్తమయం అందం 
వెన్నెల రాత్రి అందం 
పచ్చని ప్రకృతి అందం 
వీచే గాలి అందం 
పచ్చిక బయలు అందం 
పూచే పూలు అందం 
సేవ చేసే చేతులు అందం 
మంచి కోరే మనసు అందం 

Tuesday, 8 April 2014

హిందూ దేవుళ్ళను కించపరిచే పేరడీ భజనలు

అన్ని మతాల వారు తమ మతం గురించి గొప్పగా సందేశాలు ఇస్తూ వుంటే కేవలం హిందూ మతం వారు మాత్రం దేవుళ్ళపై పేరడీ చేస్తూ హాస్యం పేరుతో అపహస్యాన్ని పండిస్తున్నారు. ఇలాంటి వాటిని సెలేబ్రిటీలు ప్రోత్సహించడం బాధాకరం. సుమ, మనో యాంకరింగ్ చేస్తున్న "కెవ్వు కేక" ప్రోగ్రాంలో పేరడీ భజనల పేరుతో వస్తున్న ప్రోమోనే చిరాకు తెప్పిస్తోంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి TRP రేటింగ్ తగ్గితే కాని ఇటువంటి కాన్సెప్ట్స్ మళ్ళీ ఎంచుకోరు. 

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...