Tuesday, 9 July 2013

లాస్య రామకృష్ణ తో శ్యామలీయం గారి ఇంటర్వ్యూ

బ్లాగు - శ్యామలీయం 

బ్లాగులు 
శ్యామలీయంhttp://syamaliyam.blogspot.in/
ప్రపంచపటం http://prapanchapatam.blogspot.in/
ప్రశ్న - జవాబుల తెలుగు వ్యాకరణం http://telugugrammer.blogspot.in/
నవకవనవనం http://syamalatadigadapa.blogspot.in/
జ్యోతిశ్శాస్త్రం http://jyotissastram.blogspot.in/
గేయరచన http://geyarachana.blogspot.in/


మీ పేరు
తాడిగడప శ్యామలరావు

మీ ఊరు
భాగ్యనగరం.  (గత 40 సంవత్సరాలుగా)

స్వస్థలం
లక్ష్మీపోలవరం (రావులపాలెం దగ్గర) తూర్పుగోదావరి జిల్లా

హాబీస్
పుస్తకపఠనం.  కాని అంత తీరుబడి దొరకటం దుర్లభంగా ఉంది. ఒకప్పుడు హోమియోపతీ, జ్యోతిషంకూడా మంచి హాబీలుగా ఉండేవి - వాటిలో నాకు చెప్పుకోదగినంత పరిజ్ఞానం సామర్థ్యం ఉండేవి.

మీ పుట్టిన రోజు
మే 6.  (కాని రికార్డుల ప్రకారం ఆగష్టు 12)

అభిమాన రచయిత
విశ్వనాథ సత్యనారాయణగారు, నోరి నరసింహశాస్త్రిగారు, అడవి బాపిరాజుగారు .... ! అంతా పాతతరాల వాళ్ళేనేమో!

నచ్చే రంగు
తెలుపు

నచ్చే సినిమా
మాయాబజారు

ఇష్టమైన ఆహారం
సాత్వికాహారం.

ఇష్టమైన పుస్తకం
ఫలానా అని లేదు. చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆధ్యాత్మిక గ్రంధాలు హెచ్చుగా ఇష్టపడుతున్నాననుకుంటా. 

ఇష్టమైన ప్రదేశం
ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రదేశం యేదైనా ఇష్టమే!

జీవితం అంటే
భగవంతుడిచ్చిన వరం.

ఇతరులలో నచ్చేవి
సరళహృదయం

సాహిత్యం తో మీ ప్రయాణం  
మా నాన్నగారు నా చిన్నప్పుడే కవిత్రయాన్నీ, పోతననూ, ధూర్జటీ రామదాసులను పరిచయం చేసారు.  పాఠశాలాదినాల్లోనే పద్యాలు వ్రాసేవాణ్ణి. ముకుందా అనే మకుటంతో అముద్రితశతకంతో సహా పద్యాలూ గేయాలూ వ్రాసాను. ప్రస్తుతం నా శ్యామలీయం బ్లాగులో ఆధ్యాత్మిక కవిత్వం వ్రాస్తున్నాను. అలాగే శ్రీమద్భాగవత మాహాత్మ్యం అనే కావ్యం కూడా వ్రాస్తున్నాను


మీ రోల్ మోడల్
విశ్వనాథగారూ, మా మేనమామ ప్రసాద్‌గారూ, శ్రీనేమానివారూ మరికొంతమందీ ఉన్నారు.
 
తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం
తెలుగుభాషపట్లా సాంప్రదాయిక కవిత్వం‌పట్లా ప్రజలకు అభిరుచి కలిగించటం.  వర్థమాన సాహిత్యకారులకృషికి చేదోడు అందించటం.

వృత్తిజీవితం
నేను software engineer అవతారం యెత్తింది నలభై యేళ్ళ క్రిందటే. IBMలో DGM హోదాలో రెటైర్ అయ్యాను 2010లో

- లాస్య రామకృష్ణ 
7 comments:

 1. సాధు! సాధు!! మంచి పరిచయం, మిత్రులకు అభినందన.పరిచయం చేసిన చిరంజీవికి ఆశీర్వచనం

  ReplyDelete
  Replies
  1. కష్టేఫలే గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

   Delete

 2. వామ్మో,

  శ్యామలీయం వారంటే ఎవరో తెలుగు అధ్యాపకులు అనుకున్నా ! ఐ బీ ఎమ్ ఐటీ పక్షి గారన్న మాట !

  ముఖా ముఖీ శ్యామలీయం అద్భుతః

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. జిలేబీ గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

   Delete
 3. మీరు నలభయి సంవత్సరాల క్రితం IT రంగం లో అంత పెద్ద హోదా లో పని చేసారా? జిలేబీ గారి లాగే నేను కూడా మీరు అధ్యాపకులు అనుకున్నానండి.
  పరిచయం చేసిన లాశ్య గారికి ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. జలతారు వెన్నెల గారు, ఈ ఇంటర్వ్యూ నచ్చినందుకు ధన్యవాదములు.

   Delete
 4. స్పందించిన సహృదయసోదరబ్లాగర్లకు ధన్యవాదాలు.

  శర్మగారి ఆశీర్వచనాలకు ధన్యుడను.

  జిలేబీగారూ, IT పక్షినేనండి. నేను ఈ‌రంగంలో యాధృఛ్ఛికంగా ప్రవేశించేనాటికి కంప్యూటర్ అన్న పేరును విన్నవాళ్ళు ఆట్టే మంది లేరంటే అతిశయోక్తి కాదు. స్వయంకృషితోనే యేదో కొంచెం యెదగటం జరిగింది.

  జలతారు వెన్నెలగారూ, మరీ అంత పెద్ద హోదా యేమీ‌ కాదండీ. అది పైకి చెప్పుకోవటానికి కార్పొరేట్ సంస్థలు సీనియర్లుకు ఇచ్చే నామకార్థపు హోదా. పని మాత్రం సీనియర్ ఇంజనీర్ స్థాయిదే అయినా, పేరు డాబు అన్నమాట.

  లాస్యగారూ, ఇలా నా పరిచయం ప్రకటించిన మీకు కృతజ్ఞతలు.

  ReplyDelete

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...