Friday, 3 May 2013

నా ప్రేమకు ఇంట్లో ఒప్పుకున్నారన్న సంతోషంతో "గుండె సవ్వడి" అనే పోస్ట్ రాస్తూ మళ్ళీ బ్లాగింగ్ మొదలుపెట్టాను

బ్లాగు - మనసు లో ని మౌనరాగం "నా మనసుని తాకిన కొన్ని సంఘటనలు,  ఆలోచనలు, మదిలో మెదిలే ఊహలు, తీపిజ్ఞాపకాలు, సరదా కబుర్లూ..  వీటికి నేనిస్తున్న అక్షర రూపమే నా "మనసులోని మౌనరాగం".  2010 లో ఓ రోజు బాగా బోర్ కొట్టి ఇంటర్నెట్తో కుస్తీ పడుతుంటే, అనుకోకుండా కొన్ని తెలుగు బ్లాగ్స్ చూసాను. అప్పటి వరకూ నెట్లో తెలుగులో రాయొచ్చన్న సంగతి నాకు తెలియదు. అప్పుడే కొత్తగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకుంటున్న నాకు చాలా ఉత్సాహంగా అనిపించి వెంటనే బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాను. మొదలుపెట్టానన్న మాటే గాని తరువాత దానివైపసలు కన్నెత్తి కూడా చూడలేదు. తరువాత ఎప్పుడో 2012లో నా ప్రేమకు  ఇంట్లో ఒప్పుకున్నారన్న సంతోషంతో  "గుండె సవ్వడి" అనే పోస్ట్ రాస్తూ మళ్ళీ బ్లాగింగ్ మొదలుపెట్టాను.  ఇహ అప్పటి నుండి బ్లాగ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. దాని ద్వారా మంచి స్నేహితులను, మనసున్న మనుషులనూ కలుసుకున్నాను. ఈ కబుర్లను మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ." అంటున్న ప్రియ గారితో పూర్తి ఇంటర్వ్యూ త్వరలో మీ బ్లాగ్ లోకం లో


లాస్య రామకృష్ణ 

No comments:

Post a Comment

రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...