నందమూరి నాయకుల మధ్య వార్?


నందమూరి నాయకుల మధ్య వార్ సాగుతోందన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత తనకు తప్ప ఎవరికీ లేదని అన్నారు. తనకీ, బాబాయ్ కి పడటం లేదన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అనవసర పుకార్లను సృష్టిస్తున్నారని అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ విజయవంతమవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు ఎన్టీఆర్. బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు సంక్రాంతికి విడుదలవనున్న నేపథ్యంలో నందమూరి నాయకుల మధ్య వార్ నడుస్తోందని వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలను ఎన్టీఆర్ త్రోసిపుచ్చారు. 

Comments

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.