మీడియాలో నిజాయితీగా మాట్లాడితే కష్టమే - హీరో రామ్


'మీడియాలో నిజాయితీగా మాట్లాడితే కష్టమే'నని వ్యాఖ్యానించారు హీరో రామ్. గత కొంత కాలంగా ఫ్లాప్స్ తో సతమతమయిన రామ్ తాజాగా 'నేను శైలజ' మూవీతో సక్సెస్ బాట పట్టాడు. ఈ మూవీ గురించి దాదాపు అన్ని వెబ్ సైట్స్ లో అలాగే అన్ని చానల్స్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఒక ఛానల్ మాత్రం ఈ మూవీని ఫ్లాప్ గా నిర్థారించింది. అయితే, అదే ఛానల్ లో పనిచేస్తున్న వ్యక్తి 'నేను శైలజ' మూవీకి పాజిటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేశాడు. దాంతో ఆగ్రహించిన  యాజమాన్యం ఆ వ్యక్తిని ఉద్యోగం లోంచి తీసేసింది. ఈ ఇన్సిడెంట్ కు స్పందించిన రామ్ ఆ వ్యక్తికి ఉద్యోగం లభించేవరకు తనే జీతం ఇస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 

Comments

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.