Posts

Showing posts from January, 2016

అనుష్కకు షాకిచ్చిన సమంత?

Image

లేట్ గా అయినా మంచి డెసిషన్ తీసుకున్న కమల్ హాసన్

Image

రాజమౌళికి పద్మశ్రీ

Image

కత్రినాకు సల్మాన్ కాంప్లిమెంట్స్

Image

రోజా వర్సస్ జయసుధ

Image

Happy Sankranthi

Image

నందమూరి నాయకుల మధ్య వార్?

Image
నందమూరి నాయకుల మధ్య వార్ సాగుతోందన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత తనకు తప్ప ఎవరికీ లేదని అన్నారు. తనకీ, బాబాయ్ కి పడటం లేదన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అనవసర పుకార్లను సృష్టిస్తున్నారని అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ విజయవంతమవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు ఎన్టీఆర్. బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు సంక్రాంతికి విడుదలవనున్న నేపథ్యంలో నందమూరి నాయకుల మధ్య వార్ నడుస్తోందని వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలను ఎన్టీఆర్ త్రోసిపుచ్చారు.

వారసుడ్ని కాదు..మా తాతకు మనవడినే - ఎన్టీఆర్

Image
'నందమూరి తారక రామారావులాగా మరొక వ్యక్తి ఉండరు, జన్మించారు కూడా. నేను అయన వారసుడిని కాదు...అయన మనవడిని మాత్రమెనని చెప్పుకుంటా. ఈ జన్మకిది చాలు' అని ఎన్టీఆర్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. కథానాయకుడిగా 15 ఎల్లా ప్రయాణాన్ని గుర్తుచేసుకుని తనకే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంక్రాంతికి విడుదలవుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్

Image
హైదరాబాద్ నగరవ్యాప్తంగా  ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెయిడ్ పార్కింగ్ అక్రమాలను అడ్డుకోవడానికి అధికారులు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని  ఉచిత పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

హీరో నాని వీరప్రేమకథ

Image

డిక్టేటర్ ట్రైలర్

Image

సోగ్గాడే చిన్ని నాయన ట్రైలర్

Image

చెర్రీకి నయన్ షాక్?

Image
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నాడన్న విషయం తెలిసినదే. ఈ చిత్రానికి వి.వి.వినాయక దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారట. అయితే, నయనతార తనకు పారితోషికంగా రెండున్నర కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిందట. నయన్ డిమాండ్ కి షాక్ తిన్న రామ్ చరణ్ డైలమాలో పడ్డాడు.

అఖిల్ తో నీహారిక?

Image
మెగా ఫ్యామిలీ హీరోయిన్ నీహారిక నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. బుల్లితెరలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నీహారిక త్వరలో అఖిల్ అక్కినేని సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుందని వినికిడి. హిందీలో అదరగొట్టిన 'యే జవానీ హై దీవానీ ' చిత్రం రీమేక్ లో అఖిల్, నీహారికలు మెయిన్ రోల్స్ లో కనిపించే అవకాశాలున్నాయి.

'నాన్నకు ప్రేమతో' టీజర్

Image

టీవీ షోలో పవన్ కళ్యాణ్?

Image
త్వరలో బుల్లితెరపై పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. హిందీలో అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే' తరహాలో రూపొందనున్న టీవీషోపై పవన్ కళ్యాణ్ ఆసక్తి కనబరచాడట. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ షోని పవన్ కళ్యాణ్ హోస్ట్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'సర్ధార్ గబ్బర్ సింగ్' షూటింగ్ లో బిజీగానున్న పవన్ కళ్యాణ్ ఈ టీవీషోపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

మీడియాలో నిజాయితీగా మాట్లాడితే కష్టమే - హీరో రామ్

Image
'మీడియాలో నిజాయితీగా మాట్లాడితే కష్టమే'నని వ్యాఖ్యానించారు హీరో రామ్. గత కొంత కాలంగా ఫ్లాప్స్ తో సతమతమయిన రామ్ తాజాగా 'నేను శైలజ' మూవీతో సక్సెస్ బాట పట్టాడు. ఈ మూవీ గురించి దాదాపు అన్ని వెబ్ సైట్స్ లో అలాగే అన్ని చానల్స్ లో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఒక ఛానల్ మాత్రం ఈ మూవీని ఫ్లాప్ గా నిర్థారించింది. అయితే, అదే ఛానల్ లో పనిచేస్తున్న వ్యక్తి 'నేను శైలజ' మూవీకి పాజిటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేశాడు. దాంతో ఆగ్రహించిన  యాజమాన్యం ఆ వ్యక్తిని ఉద్యోగం లోంచి తీసేసింది. ఈ ఇన్సిడెంట్ కు స్పందించిన రామ్ ఆ వ్యక్తికి ఉద్యోగం లభించేవరకు తనే జీతం ఇస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 

ఈడు గోల్డ్ ఎహె

Image
'కృష్ణాష్టమి' చిత్రంతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న సునీల్ త్వరలో 'ఈడు గోల్డ్ ఎహె' చిత్రం ద్వారా ప్రేక్షకులకు కితకితలు పెట్టనున్నాడు. ఈ చిత్రంలో సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. వీరు పొట్ల ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.బిగ్ బీకి సూపర్ స్టార్ సలహా...

Image
సూపర్ స్టార్ రజినీ కాంత్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'రోబో 2.0' చిత్రంలో విలన్ రోల్ కోసం బిగ్ బీ ని సంప్రదించాడట దర్శకుడు శంకర్. అయితే, రజినీ సలహా మేరకు ఆ పాత్రను తిరస్కరించాడట బిగ్ బీ. విషయమేమిటంటే, ప్రేక్షకులు బిగ్ బీ ని విలన్ గా చూడడానికి ఇష్టపడరని బిగ్ బీ ఎల్లప్పుడూ ప్రేక్షకుల దృష్టిలో హీరోనేనని రజినీకాంత్ బిగ్ బీకి సూచించాడట. రజినీ సూచనను పాటించిన బిగ్ బీ విలన్ రోల్ ను తిరస్కరించినట్టు ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ముందస్తు క్షమాపణలు చెప్పిన రకుల్

Image
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి వరసగా అవకాశాలైతే వస్తున్నాయి గాని సక్సెస్ మాత్రం లభించడం లేదు.దాంతో, ఈ నెలలో విడుదలవుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రంపైనే రకుల్ గంపెడాశలు పెట్టుకుంది. తొందరగా తెలుగు నేర్చుకున్న రకుల్ ఈ చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందట. తెలుగు భాషలో ఏవైనా తప్పులు దొర్లుంటే క్షమించమని ముందస్తు క్షమాపణలు కూడా అడిగేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రమైనా రకుల్ ను సక్సెస్ బాటలో నడిపించాలని రకుల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

దేవిశ్రీకి జోడీగా సమంత?

Image
మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా మన ముందుకు రానున్నాడు. తన సంగీతంతో ఇన్నాళ్ళు ప్రేక్షకులను అలరించిన దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ దర్శకత్వంలో హీరోగా తన అభిమానులని అలరించనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. దేవిశ్రీకి జోడీగా సమంత నటించనున్నట్టు ఫిలిం సర్సిల్స్ న్యూస్.

కమెడియన్ కుమార్తె హీరోయిన్ గా 'షి'

Image
కమెడియన్ ఉత్తేజ్ కుమార్తె చేతన ఉత్తేజ్ హీరోయిన్ గా 'షి' అనే చిత్రం తెరకెక్కుతోంది. 'ఈజ్ వెయిటింగ్' అనేది ట్యాగ్ లైన్. మహాత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తున్నాడు. శ్వేతా మీనన్ కీలక పాత్ర పోషిస్తోంది. కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మాత. వినూత్న ప్రేమ కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని చిత్ర బృందం చెబుతోంది.

ప్రభాస్ పెళ్ళెప్పుడు?

Image
ప్రభాస్ పెళ్లి కుదిరిదంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రభాస్ మాత్రం తన డ్రీం గాళ్ తనకింకా కనిపించలేదని పెళ్లి మాటను దాటవేశాడు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాదైనా పప్పన్నం పెడతాడా అని ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తండ్రితో వాదనకు దిగిన ఏడాది చిన్నారి

Image

కోర్టుకు అల్లు అర్జున్

Image
ఓ సివిల్ కేసు విషయంలో సినీ నటులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, తల్లి నిర్మల సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చారు. కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో భూతగాదా విషయంలో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి. కాగా, సుమారు ఆరేళ్లుగా సాగుతున్న ఈ తగాదా విషయం కొలిక్కి వచ్చినట్లయింది.

హిప్నాసిస్, రిలాక్సేషన్ తో పేగుల్లో చికాకు దూరం

Image
పేగుల్లో బాధ, కడుపు ఉబ్బరం, వరసపెట్టి విరేచనాలు, లేదంటే మలబద్ధకం...వైద్య పరీక్షల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లే తేలుతుంది! ఈ పేగు చికాకు సమస్యను 'ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ 'ఐబిఎస్'' గా చెబుతారు. ఈ సమస్యను స్వల్పకాలిక మానసిక చికిత్సతో దీర్ఘకాలం నియంత్రించవచ్చంటున్నారు...అమెరికాలోని వండర్ బిల్డ్ వైద్య కేంద్రం పరిశోదకులు. వివిధ దేశాలకు చెందిన 2,200 మంది ఐబిఎస్ రోగులను వీరు క్షుణ్ణంగా పరిశీలించి, మానసిక చికిత్సను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన ఫలితాలను గ్యాస్ట్రో ఎంటరాలజీ-హెపటాలజీ పత్రిక ఇటీవల ప్రచురించింది.

ఆరాధ్య, అబ్ రామ్ ల జోడీని ఆమోదించిన బిగ్ బీ

Image
మొన్నామధ్య ఇంటర్వ్యూలో షారుఖ్ ను తన కుమారుడు అబ్ రామ్ కు ఫ్యూచర్ జోడీ ఎవరని ప్రశ్నించగా అందుకు సమాధానంగా ఆరాధ్య బచ్చనే కరక్టని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అమితాబ్ కూడా ఇదే విషయాన్ని ఆమోదించాడు. సో సెలబ్రిటీ కిడ్స్ ఆరాధ్య, అబ్ రామ్ ల కోసం దర్శకులు ఇప్పటినుంచే కథలు సిద్ధం చేసేసినా అతిశయోక్తి లేదు.
- లాస్య 

మహేష్ 'బ్రహ్మోత్సవం' అప్డేట్స్

Image
శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మోత్సవం' . కాజల్, సమంత, ప్రణీత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. జనవరి 1న విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

బ్లాగు లోకం - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్

'బ్లాగు లోకం'లో మీ బ్లాగులను జతచేయడానికి ఇక్కడ కామెంట్ పెట్టండి. బ్లాగ్ లోకం లోగోను మీ బ్లాగులో జతపరచండి. 

ధన్యవాదములు 
బ్లాగు లోకం బృందం

అగ్రిగేటర్స్ బ్లాగర్స్ నుంచి డబ్బులు ఆశించాలా?

ఈ మధ్యకాలంలో అగ్రిగేటర్స్ ని 'పెయిడ్ అగ్రిగేటర్స్' గా మార్చాలన్న వాదన వినిపిస్తోంది. అగ్రిగేటర్ లో బ్లాగు కనిపించాలంటే డబ్బులు చెల్లించాలనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమంటారు?

'బ్లాగ్ లోకం'లో మీ బ్లాగుందా?

మీ బ్లాగ్ ని బ్లాగ్ లోకంలో జతపరచాలంటే కామెంట్ లో మీ బ్లాగ్ అడ్రస్ ని రాయండి. మీ బ్లాగ్ ని బ్లాగ్ లోకానికి జతపరుస్తాము.

2016 - ఆశల హరివిల్లు

Image