తెలుగు బ్లాగులకు అగ్రిగేటర్స్ అవసరమా?

అగ్రిగేటర్స్ అవసరమే. అగ్రిగేటర్స్ వల్లే బ్లాగ్స్ కి ప్రచారం కలుగుతుంది. మన అభిప్రాయం నలుగురికీ చేరుతుంది. మరి అగ్రిగేటర్స్ అవసరం లేదు అని భావించేవారూ ఉన్నారేమోనని చిన్న అనుమానం. మీరేమంటారు? అగ్రిగేటర్స్ అవసరమేనా?

Comments

 1. బంగారపు పళ్ళానికి కూడా గోడ చేరుపు కావాలి ఇది సామెత. బంగారు పళ్ళెం ఐనంతలో గాలిలో నిలబడదు. అలాగే బ్లాగు బాగుంది, జీవితానికి ఉపయోగపడేవి రచయిత రాస్తారు అని పది మందికి తెలియాలంటే ఆగ్రిగేటర్ అవసరమే. ఎవరిమటుకువారు ఆగ్రిగేటర్ తయారు చేసుకోగలిగితే మంచిదే, అది సాధ్యమా? కొంతమంది రీడింగ్ లిస్ట్ కూడా ఉండనివాళ్ళుంటారు. ఆగ్రిగేటర్ అవసరమే,సవ్యంగా ఉపయోగించుకోవాలి, డబ్బు కట్టాలి, అలా ఐతేనే బ్లాగులూ ఆగ్రిగేటర్లూ నిలబడతాయి, లేకపోతే ఇలా సంకలినులు,హారాలు, కూడళ్ళు రోజుకోటి కూలిపోతూనే వుంటాయి. తప్పదు. గాలి తిని బతికే రోజు లేదు :)

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు తాతయ్యగారు

   Delete
 2. సమాజం అవసరం అయితే ఆగ్రిగ్రేటర్లూ అవసరమే !
  సమాజంతో పనిలేదు అంటే ఏకోనారాయణా!

  ReplyDelete
  Replies
  1. నిహారిక గారు చెప్పినది కరెక్ట్ .. అలాగే ఎంత బాగా వ్రాసినా చదివేవారికి అందాలంటే ప్రచారం తప్పక అవసరం అవి ఉచితంగా చేసేవే ఈ ఆగ్రిగేటర్లు

   Delete
  2. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు నీహారిక గారు, శ్రీనివాస్ గారు

   Delete
 3. అగ్రిగేటర్ లేకుండా ఏ బ్లాగుకు విజిటర్స్ రారు. ఎందుకంటే ఆ బ్లాగు ఎవరికీ తెలియదు గనుక. కాబట్టి శర్మ గారు చెప్పిందే కరెక్ట్. అలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఇక నా బ్లాగ్ వేదిక కూడా రెడీ చేశాను.ఏదో చిన్న ప్రయత్నం సుమా!
  http://blogvedika.blogspot.com/

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు K.S.Chowdary గారు

   Delete
 4. There was a necessity a few years ago. But now, I dont think there is a need for the aggregatgors anymore. However, we shall try to continue Maalika as long as we can. We have some issue with the Wordpress blogs but we hope to resolve it soon.

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు భరద్వాజ్ గారు.

   Delete

Post a Comment

Popular posts from this blog

ఈ సంవత్సరంలో బ్లాగ్లోకం లో చోటు చేసుకున్న మొదటి రెండు బ్లాగులు.