Friday 2 August 2013

లాస్య రామకృష్ణ తో నిమ్మగడ్డ చంద్రశేఖర్ గారి ఇంటర్వ్యూ


బ్లాగు - వృత్తాంతి 
బ్లాగు లంకె - http://vruttanti.blogspot.in


మీ పేరు 
నిమ్మగడ్డ చంద్ర శేఖర్

మీ ఊరు 
2004 నుండి బెంగళూరులో నివాసం; 4 సంవత్సరాలు చెన్నైలో 5 సంవత్సరాలు మహారాష్ట్రలొ, అంతకు ముందు హైదరాబాదులొ వుద్యోగం

స్వస్థలం 
మాది ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దైవాలరావూరు గ్రామం

హాబీస్ 
ప్రతి రోజూ కనీసం 4 దిన పత్రికలు చదవడం, వారానికొక మంచి పద్యం బట్టీ కొట్టడం 

పుట్టిన రోజు 
జున్ 12

అభిమాన రచయిత
చెప్పడం చాలా కష్టం.  కవి సామ్రాట్ విశ్వనాథ గారి పుస్తకాల మీద కుస్తీ పడుతూ అస్వాదిస్తున్నాను. 

నచ్చే రంగు 
తెలుపు రంగు 

నచ్చే సినిమా 
ముత్యాల ముగ్గు 

ఇష్టమైన ఆహారం 
బాపట్ల ప్రాంతంలొ దొరికే వంకాయతో కూర, దోసకాయ పప్పు 

ఇష్టమైన పుస్తకం 
మను చరిత్ర - కనీసం 10 సార్లు చదివాను.  సుమారు 30 పద్యాలు, వచనం నోటికి వచ్చు 

ఇష్టమైన ప్రదేశం 
శ్రింగేరి - నన్ను నేను మర్చిపోయి, శారదా దేవి ఆలయంలో నిలబడి బమ్మెర పోతన భాగవతం నుంచి "క్షోణి తలంబు నున్నుదుట సొకగ మ్రొక్కి నుతింతు" అనే పద్యాన్ని పాడుకుంటూ ఆనందిస్తా 

జీవితం అంటే 
మానవ జీవితం చాలా చిన్నది. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించకు, పరిష్కారం వున్న సమస్యకు ఎట్లైనా సమాధానం దొరుకుతుంది కాబట్టి, అదే విషయాన్ని తీవ్రంగా ఆలొచించి వత్తిడికి గురి కావడం అనవసరం.   ఆది శంకరుడు చెప్పినట్లు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే.  మనకున్నదాంతో త్రుప్తి పడి, కష్తాల్లొ వున్న వ్యక్తికి  సాయం చేస్తే, అదే మనకు శ్రీరామ రక్ష. 

ఇతరులలో నచ్చేవి 
కొంత మంది వాక్చాతుర్యం; తెలివితేటలు 

సాహిత్యం తో మీ ప్రయాణం 
కేవలం పద్యం బ్రతికితేనే మన భాష బ్రతికేది అని కొంతమంది పెద్దల పరిచయం వలన తెలుసుకున్నాను.  5వ తరగతి నుండి 10 వ తరగతి వరకు వున్న తెలుగు పుస్తకాలను కొని భాష మీద పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. పంచ కావ్యాలను సరళమైన పుస్తకాల ద్వారా ఆకళింపు చేసుకుంటున్నాను.  పింగళి సూరన విరచిత కళా పూర్ణోదయం చదివిన తరువాత, ఒక పద్యం పై నుంచి కిందకు ఒకలా, కింద నుంది పైకి చదివితే మరోలా అర్ధం - ఇలాంటి విషయాలు తెలియని తెలుగు వాళ్ళు ఎంత కోల్పోతున్నారో అని ఆలోచిస్తా.  

మీ రోల్ మోడల్ 
అబ్దుల్ కలాం 

తెలుగు భాషకు మీ ప్రయత్నం 
నా సహాద్యాయుడు మిత్రుదు లక్ష్మీ రెడ్డి గారి ఆర్ధిక సహకారంతో, తెలుగు భాషపై మమకారం కలిగించేలా సహస్రావధాని డా|| గరికిపాటి గారి ఉపన్యాసం బెంగలూరులో ఏర్పాటు చేశాము. ఒంగోలులో జిల్లా వ్యాప్త పద్య ధారణ పోటీలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు గరికిపాటి గారిచే తెలుగు భాష గొప్పదనం తెలిపాము.   సి పి బ్రౌన్ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా స్థానిక తెలుగు మాధ్యమ ఏకోపాధ్యాయ పాఠశాలల పిల్లలను కలిసి ప్రొత్సహించాము.  జాతీయ స్థాయి పద్య, నాటక మరియు గేయ పోటీలు నిర్వహించాము (అనివార్య కారణాల వలన ఇంకా ఫలితాలు ప్రకటించలేదు).  

వృత్తి జీవితం 
నేను బి కాం; పిజిడిఎం ఎం ; పిజిడిపిఎ; ఎంబిఎ చదువుకున్నాను. ఢిల్లీ కేంద్రంగా నెలకొల్పిన పెద్ద ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలో డి జి ఎం -మార్కెటింగ్ (దక్షిణ జొన్) గా పనిచేస్తున్నాను. 

లాస్య రామకృష్ణ 





Sunday 21 July 2013

లాస్య రామకృష్ణ తో శశికళ గారి ఇంటర్వ్యూ

బ్లాగు - ఇది శశి ప్రపంచం 
బ్లాగు లంకె http://itissasiworld.blogspot.in



పేరు
శశి కళ వాయుగుండ్ల 

ఊరు
నెల్లూరు జిల్లాలో చిన్న పల్లె 

హాబీస్
బుక్ రీడింగ్ , సినిమాలు 

పుట్టిన రోజు
మే పన్నెండు 

అభిమాన రచయిత
మల్లాది , దాశరది రంగా చార్య 

నచ్చే రంగు
తెలుపు 

నచ్చే సినిమా 
రోజా 

ఇష్టమైన ఆహారం
ఏవైనా పర్లేదు వెజ్ మాత్రమే 

ఇష్టమైన పుస్తకం
రైలు బడి 

ఇష్టమైన ప్రదేశం
మా ఊరు ,తిరుమల 

జీవితం అంటే
ఎన్నో అనుభవాలు పొందడం కోసం మనం వేసే ఒక నాటకం 

ఇతరులలో నచ్చేవి
నిస్వార్ధమైన స్నేహం,ఆప్యాయంగా మాట్లాడే మాటలు 

సాహిత్యం తో మీ ప్రయాణం
రెండు కవిత సంకలనాలు వెలువర్చాను. (జాబిలి తుణకలు, స్వర్ణ ముఖీ సవ్వడులు నానీల సంకలనం) ఇప్పుడు బ్లాగ్ మరియు ప్రస్తుతం కధలు వ్రాస్తున్నాను 



మీ రోల్ మోడల్
వివేకానంద ,అబ్దుల్ కలాం 

తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
మా బడి లో పిల్లలకు కధలు, కవితలు వినిపిస్తూ వారి చేత కూడా వ్రాయిస్తూ ఉంటాను 


- లాస్య రామకృష్ణ 


Tuesday 16 July 2013

కందిశంకరయ్యగారు మరియు శృతిగారు అడిగిన ప్రశ్నకి సమాధానం


బ్లాగ్ లో కాపీ పేస్టు ఆప్షన్ డిసేబుల్ చెయ్యడం వలన కలిగే లాభాలేమిటి. చెయ్యకపోతే నష్టమేమిటి. 

బ్లాగ్ లో ఎంతో కష్టపడి విలువైన సమాచారం మనం పొందుపరుస్తాము. అటువంటి సమాచారాన్ని ఎవరైనా ఈజీ గా కాపీ చేసి వాళ్ళ వెబ్సైటులలో కానీ బ్లాగులలో కానీ పేస్టు చేసుకునే అవకాశం కలదు. 

బ్లాగ్ లో ని సమాచారాన్ని సులభంగా తస్కరించకుండా ఉండేందుకు కాపీ పేస్టు ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యవచ్చు. 

- లాస్య రామకృష్ణ 


Monday 15 July 2013

కాపీ పేస్టు ఆప్షన్ ని ఈ విధం గా బ్లాగులో డిసేబుల్ చెయ్యవచ్చు.




నాకు తెలిసిన ఈ సమాచారాన్ని బ్లాగు మిత్రులతో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను

1. మొదటగా Blogger లో కి లాగిన్ అయ్యి మీ బ్లాగ్ ని సెలెక్ట్ చేసుకోండి 


2. లేఔట్(Layout) లో ని Add a Gadget ని click చేసి  HTML/JAVASCRIPT ని select చేసుకోండి. 


3. ఇప్పుడు ఈ క్రింద కోడ్ ని ఆ గాడ్జెట్ లో కాపీ చేసి సేవ్ చెయ్యండి. 


<!--Disable Copy And Paste-->

<script language='JavaScript1.2'>

function disableselect(e){
return false
}
function reEnable(){
return true
}
document.onselectstart=new Function ("return false")
if (window.sidebar){
document.onmousedown=disableselect
document.onclick=reEnable
}
</script>

4. ఇప్పుడు మీ బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి. 

- లాస్య రామకృష్ణ 

Thursday 11 July 2013

లాస్య రామకృష్ణ తో మాలా కుమార్ గారి ఇంటర్వ్యూ


బ్లాగు - సాహితి 

ఇతర బ్లాగులు 

పేరు
మాలాకుమార్(అసలు పేరు కమల అనుకోండి , మాల గా మారిపోయి అదే చలామణి అవుతోంది:))

మీ ఉరు
హైదరాబాద్

స్వస్తలం
అంటే పుట్టింటివారిది నందిగామ , అత్తింటివారిది ఖమ్మం . కాని రెండు చోట్లకు అప్పుడప్పుడు బంధువులను కలిసేందుకు వెళ్ళిరావటం తప్ప ఎప్పుడూ వుండలేదు.

హాబీస్
చాలా వున్నాయి:)ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే వుంటాను.కాని ముఖ్యమైనది నవలలు చదవటం.

పుట్టినరోజు
25 జులై

అభిమాన రచయిత
చాలా మంది వున్నారు . యద్దనపూడి సులోచనారాణి, పొత్తూరి విజయలక్ష్మి, మల్లాది , ఆనందారామం, కావలిపాటి విజయలక్ష్మి, చిట్టారెడ్డి సూర్యకుమారి, మాదిరెడ్డి సులోచన అబ్బో ఇలా చాలా మంది వున్నారు.

నచ్చేరంగు
లేత రంగులు , తెలుపు , లేత గులాబి

నచ్చే సినిమా
కొట్టుకోవటాలు , రక్తపాతాలు లేని ఏవైనా చక్కని కుటుంబకథా చిత్రాలు, వెకిలి హాస్యం లేని హాస్య చిత్రాలు నచ్చుతాయి.కొంచం మూడ్ బాగాలేనప్పుడల్లా పాత మిస్సమ్మ చూస్తుంటాను:
ఇష్టమైన ఆహారం
మసాలాలు లేని ఏదైనా శాఖాహారం

ఇష్టమైన పుస్తకం
ఏవైనా చాలా లైట్ గా వుండేవి,ముఖ్యం గా హాస్య పుస్తకాలు ఇష్టం. మధ్య చదివినవాటిల్లో నచ్చింది, మల్లాది "సద్దాం ఆంటీ ఇంటి కథ."

ఇష్టమైన ప్రదేశం
డార్జిలింగ్, హిమాలయాలు . ఎప్పటికైనా హిమాలయాలలో స్తిరపడాలని నా చిరకాల కోరిక

జీవితం అంటే
కష్టసుఖాల కలనేత చీర
ఇతరులలో నచ్చేవి 
మృదు సంభాషణ

సాహిత్యం తో మీ ప్రయాణం
మా పుట్టింట్లో అందరూ కొద్దో గొప్పో సాహిత్యం అంటే అభిమానం వున్నవారే. మా మామయ్యలు, అమ్మా , పిన్నీ కలిసి నప్పుడల్లా సాహిత్య చర్చలు జరుగుతూవుంటాయి. నా చిన్నప్పుడే మా అమ్మ, కళాపూర్ణోదయం , ఆరుద్ర సమగ్ర ఆంధ్ర చరిత్ర , బారిస్టర్ పార్వతీశం , గణపతి, బుడుగు,టాంసాయర్ లాంటి పుస్తకాలు చాలా చదివించింది.అలా చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు.  2008 లో బ్లాగ్” సాహితి” మొదలుపెట్టి నప్పటి నుంచి ఏదో వ్రాయటం అలవాటైంది.
మీ రోల్ మోడల్
మా అత్తగారు.

తెలుగు బాషకు మీ వంతు ప్రయత్నం
తెలుగులో వ్రాయటం, తెలుగు చదవటం,మనవళ్ళకూ మనవరాళ్ళకు తెలుగు నేర్పించి, తెలుగు కథలు చెప్పటమే :)

- లాస్య రామకృష్ణ


Tuesday 9 July 2013

లాస్య రామకృష్ణ తో శ్యామలీయం గారి ఇంటర్వ్యూ

బ్లాగు - శ్యామలీయం 

బ్లాగులు 
శ్యామలీయంhttp://syamaliyam.blogspot.in/
ప్రపంచపటం http://prapanchapatam.blogspot.in/
ప్రశ్న - జవాబుల తెలుగు వ్యాకరణం http://telugugrammer.blogspot.in/
నవకవనవనం http://syamalatadigadapa.blogspot.in/
జ్యోతిశ్శాస్త్రం http://jyotissastram.blogspot.in/
గేయరచన http://geyarachana.blogspot.in/


మీ పేరు
తాడిగడప శ్యామలరావు

మీ ఊరు
భాగ్యనగరం.  (గత 40 సంవత్సరాలుగా)

స్వస్థలం
లక్ష్మీపోలవరం (రావులపాలెం దగ్గర) తూర్పుగోదావరి జిల్లా

హాబీస్
పుస్తకపఠనం.  కాని అంత తీరుబడి దొరకటం దుర్లభంగా ఉంది. ఒకప్పుడు హోమియోపతీ, జ్యోతిషంకూడా మంచి హాబీలుగా ఉండేవి - వాటిలో నాకు చెప్పుకోదగినంత పరిజ్ఞానం సామర్థ్యం ఉండేవి.

మీ పుట్టిన రోజు
మే 6.  (కాని రికార్డుల ప్రకారం ఆగష్టు 12)

అభిమాన రచయిత
విశ్వనాథ సత్యనారాయణగారు, నోరి నరసింహశాస్త్రిగారు, అడవి బాపిరాజుగారు .... ! అంతా పాతతరాల వాళ్ళేనేమో!

నచ్చే రంగు
తెలుపు

నచ్చే సినిమా
మాయాబజారు

ఇష్టమైన ఆహారం
సాత్వికాహారం.

ఇష్టమైన పుస్తకం
ఫలానా అని లేదు. చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆధ్యాత్మిక గ్రంధాలు హెచ్చుగా ఇష్టపడుతున్నాననుకుంటా. 

ఇష్టమైన ప్రదేశం
ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రదేశం యేదైనా ఇష్టమే!

జీవితం అంటే
భగవంతుడిచ్చిన వరం.

ఇతరులలో నచ్చేవి
సరళహృదయం

సాహిత్యం తో మీ ప్రయాణం  
మా నాన్నగారు నా చిన్నప్పుడే కవిత్రయాన్నీ, పోతననూ, ధూర్జటీ రామదాసులను పరిచయం చేసారు.  పాఠశాలాదినాల్లోనే పద్యాలు వ్రాసేవాణ్ణి. ముకుందా అనే మకుటంతో అముద్రితశతకంతో సహా పద్యాలూ గేయాలూ వ్రాసాను. ప్రస్తుతం నా శ్యామలీయం బ్లాగులో ఆధ్యాత్మిక కవిత్వం వ్రాస్తున్నాను. అలాగే శ్రీమద్భాగవత మాహాత్మ్యం అనే కావ్యం కూడా వ్రాస్తున్నాను


మీ రోల్ మోడల్
విశ్వనాథగారూ, మా మేనమామ ప్రసాద్‌గారూ, శ్రీనేమానివారూ మరికొంతమందీ ఉన్నారు.
 
తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం
తెలుగుభాషపట్లా సాంప్రదాయిక కవిత్వం‌పట్లా ప్రజలకు అభిరుచి కలిగించటం.  వర్థమాన సాహిత్యకారులకృషికి చేదోడు అందించటం.

వృత్తిజీవితం
నేను software engineer అవతారం యెత్తింది నలభై యేళ్ళ క్రిందటే. IBMలో DGM హోదాలో రెటైర్ అయ్యాను 2010లో

- లాస్య రామకృష్ణ 




Thursday 4 July 2013

లాస్య రామకృష్ణ తో సత్యనారాయణ శర్మ గారి ఇంటర్వ్యూ



బ్లాగు - నా ఆలోచనల పరంపర 
బ్లాగు లంకె - http://naalochanalaparampara.blogspot.in/
రచయిత - సత్యనారాయణ శర్మ 




మీ పేరు:
గుంటూరి సత్యనారాయణ శర్మ

మీ ఉరు:
హైదరాబాద్

స్వస్తలం:
గుంటూరు

హాబీస్:
బుక్ రీడింగ్ ,ఇంటర్నెట్ బ్రౌజింగ్ , క్యారమ్స్ ఆడటం  

మీ పుట్టిన రోజు :
నవంబర్ 3

అభిమాన రచయిత:
అంటే , చాలా మంది ఉన్నారు . నవలా రూపంలో యండమూరి , సినీ  వినీలాకాశంలో పాత తరపు రచయితలు సీనియర్ సముద్రాల నుంచి వేటూరి వరకు ,   నేటితరంలో చంద్రబోసు గార్లు 
                                                                                                                                 
నచ్చే రంగు:
తెలుపు , నీలం

నచ్చే సినిమా:
వాస్తవికతకు దగ్గఱగా వున్నది 

ఇష్టమైన ఆహారం:
శాకాహారం , మరియు చిత్రాన్నం

ఇష్టమైన పుస్తకం:
విజయానికి ఐదు మెట్లు 

ఇష్టమైన ప్రదేశం:
అమెరికా 

జీవితం అంటే:
ఎంతో విలువైనది . సద్గుణాలను తమ జీవితాలకు అన్వయించుకొంటూ జీవించాలి . ఆ శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , ఆంజనేయుడు , ఏసు , మహవతార్ బాబాజీ , షిర్డీ సాయిబాబా వరకు అందరూ యిలా మహనీయులైన వాళ్ళే  
                                                                                                                                                   
ఇతరులలో నచ్చేవి:
సత్ప్రవర్తన 

సాహిత్యం తో మీ ప్రయాణం
సదాలోచనలను నలుగిరితో పంచుకొనటం 

మీ రోల్ మోడల్:
ముక్కు సూటిగా సంభాషించటం 

తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం: 
భగీరధ ప్రయత్నాలంటూ ఏమీ లేవు , కాకుంటే తెలుగుని సక్రమంగా వ్రాయాలి , స్పష్టతగా ఉఛ్ఛరించాలి.

- లాస్య రామకృష్ణ 















Tuesday 25 June 2013

లాస్య రామకృష్ణ తో కంది శంకరయ్య గారి ఇంటర్వ్యూ

బ్లాగు - శంకరాభరణం 
బ్లాగు రచయితకంది శంకరయ్య
బ్లాగు చిరునామాhttp://kandishankaraiah.blogspot.in



పేరు :
కంది శంకరయ్య

ఊరు:
వరంగల్     

స్వస్థలం: 
వరంగల్

హాబీస్:
పుస్తక పఠనం, యాత్రలు

పుట్టిన రోజు
17-7-1950

అభిమాన రచయిత:
విశ్వనాథ సత్యనారాయణ, జేమ్స్ హాడ్లీ ఛేజ్

నచ్చే రంగు :
నాకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది

నచ్చిన సినిమాలు:
మాయాబజార్, సువర్ణసుందరి, రాజు-పేద, గుండమ్మ కథ

ఇష్టమైన ఆహారం:
ప్రత్యేకంగా ఏదీ లేదు

ఇష్టమైన పుస్తకాలు:
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ది కౌంట్ ఆఫ్ మాంట్‌క్రిస్టో

ఇష్టమైన ప్రదేశం:
కేరళ

జీవితం అంటే:
పరిష్కారం లేని సమస్య

ఇతరులలో నచ్చేవి:
మంచితనం

సాహిత్యం తో మీ ప్రయాణం:
విద్యార్థి దశనుండి

మీ రోల్ మోడల్:
ఎవరూ లేరు

తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం:
 ‘శంకరాభరణం’ బ్లాగు నిర్వహణ, తెలుగు నిఘంటువు డజిటలైజేషన్‌లో దాదాపు 1000 పేజీల టైపింగు.


- లాస్య రామకృష్ణ 





Saturday 18 May 2013

లాస్య రామకృష్ణ తో తెలుగు వెన్నెల బ్లాగర్ కాయల నాగేంద్ర గారి ఇంటర్వ్యూ



రచయిత - కాయల నాగేంద్ర 

ఉగాది కవిత 

ఉగాది వచ్చింది 

వసంతాన్ని తెచ్చింది 

మనసంతా నింపింది 

మదినిండా పూల పరిమళాలను చుట్టుకుని

పచ్చదనంతో అందంగా ముస్తాబై

పురివిప్పిన మయూరంలా... 

వేంచేసింది వయ్యారంగా!               

మావి చివుళ్ళు తిన్న కోయిలమ్మ 

తన్మయంతో గానం చేస్తూ... 

సప్త స్వరాలను పలికిస్తూ...  

కనువిందు  చేసింది కమనీయంగా!

మత్తెక్కించే
మల్లెల గుబాళింపులు 

సహజ పరిమళాలను వెదజల్లే వేపపువ్వులు... 
                                   

పచ్చగా నిగనిగ లాడే మామిడి పిందెలు...  

చిగురించిన వృక్షాలతో ప్రకృతి సోయగాలు 

ఆహ్వానిస్తున్నాయి రమణీయంగా!


మీ పేరు   
కాయల నాగేంద్ర 

మీ ఉరు   
హైదరాబాద్ 

స్వస్తలం 
రాజంపేట, కడప (జిల్లా)

హాబీస్   
పుస్తకాలు చదవడం, టీవీ చూడటం, బ్లాగ్, పేస్ బుక్ కి రచనలు చేయడం

మీ పుట్టిన రోజు  
2nd  అక్టోబర్ 

అభిమాన రచయిత 
చలం గారు 

నచ్చే రంగు   
బ్లూ 

నచ్చే సినిమా 
పాతాళ బైరవి 

ఇష్టమైన ఆహారం 
విజిటేబుల్ పలావ్ 

ఇష్టమైన పుస్తకం 
అసమర్ధుని జీవయాత్ర 

ఇష్టమైన ప్రదేశం 
తిరుమల  

జీవితం అంటే 
కష్టసుఖాలు 

ఇతరులలో నచ్చేవి 
మంచితనం, నిజాయితీ 

సాహిత్యం తో మీ ప్రయాణం 
సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం  

మీ రోల్ మోడల్ 
నందమూరి తారక రామారావు (సీనియర్)

తెలుగు భాషకు మీ వంతు ప్రయత్నం 
తెలుగువారి చేత తెలుగు రాయించడం, చదివించడం, మాట్లాడించడం!


- లాస్య రామకృష్ణ 







రూ.500 /- కంటే తక్కువ బడ్జెట్ తో ఎక్స్పెన్సివ్ లుక్ ను అందించే హ్యాండ్ బ్యాగ్స్

మీ అవుట్ ఫిట్స్ తో పాటు మీ యాక్ససరీస్ కూడా మీ స్టైల్ ను పెంపొందించడంలో దోహదపడతాయి. యాక్ససరీస్ లో హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయ...